టెలికాం కంపెనీ కొనుగోలు వార్తలు ఖండించిన రిలయన్స్‌!

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఓ ప్రముఖ టెలికాం కంపెనీని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. 

Published : 29 Nov 2021 19:20 IST

ముంబయి: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఓ ప్రముఖ టెలికాం కంపెనీని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టంచేసింది. కొనుగోలుపై వచ్చిన వార్తలు నిరాధారమైనవని రిలయన్స్‌ కొట్టిపారేసింది.

బ్రిటన్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ లైన్ టెలికాం కంపెనీ ‘బీటీ గ్రూప్‌’ను స్వాధీనం చేసుకోవడమో లేదా నియంత్రిత వాటాను కొనుగోలు చేసేందుకు ఆఫర్‌ చేయొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక ఒకటి పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా బీటీ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్కింగ్‌ విభాగపు వ్యాపార విస్తరణకు నిధులు సమకూర్చేందుకు రిలయన్స్‌ ముందుకొచ్చిందని, చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సదరు పత్రిక తెలిపింది. అయితే, అదంతా అవాస్తవమని రిలయన్స్‌ స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని