ఐఎంజీ వరల్డ్‌వైడ్‌లో మెజార్టీ వాటాలు రిలయన్స్‌కు..

బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో కొనుగోలు చేసింది. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌ ఎల్‌ఎల్‌సీతో కలిసి   నిర్వహిస్తున్న సోర్ట్స్‌మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ ‘ఐఎంజీ-ఆర్‌’ను సొంతం చేసుకొంది.

Updated : 30 Dec 2020 16:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిలియనీర్‌ ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో కొనుగోలు చేసింది. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌ ఎల్‌ఎల్‌సీతో కలిసి నిర్వహిస్తున్న సోర్ట్స్ ‌మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ ‘ఐఎంజీ-ఆర్‌’ను సొంతం చేసుకొంది. ఐఎంజీ వరల్డ్‌వైడ్‌కు చెందిన 50శాతం వాటాలను రిలయన్స్‌ రూ.52.08 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని రిలయన్స్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి అందజేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుంది.

భారత్‌లో క్రీడలు-వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్‌ చేయడం కోసం 2010లో రిలయన్స్‌-ఐఎంజీ వరల్డ్‌వైడ్‌లు ఓ సంయుక్త సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్‌లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్‌ చేసింది. ‘షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్‌ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తాం. ఈ డీల్‌ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్‌ చేస్తాం. ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్‌లు అవసరం లేదు’’ అని రిలయన్స్‌ తెలిపింది.  ప్రస్తుతం ఐఎంజీ-ఆర్‌ ఏటా జీఎస్టీతో కలుపుకొని రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం చేస్తోంది. వీటిల్లో నిఖర లాభం రూ.16.35 కోట్లుగా నిలిచింది.

ఇవీ చదవండి

3డీలో ఇల్లు కట్టేశారు

అలీబాబాపై దర్యాప్తు చేపడతాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని