దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించండి

సిప్ పెట్టుబ‌డులు దీర్ఘకాలం కొన‌సాగిస్తే ఆశించిన రాబ‌డిని పొంద‌వ‌చ్చు....

Updated : 01 Jan 2021 18:12 IST

సిప్ పెట్టుబ‌డులు దీర్ఘకాలం కొన‌సాగిస్తే ఆశించిన రాబ‌డిని పొంద‌వ‌చ్చు

ఈక్విటీ పెట్టుబ‌డులు ఫిక్స్‌డ్ ఆదాయ ప‌థ‌కాల కంటే దీర్ఘ‌కాలంలో ఒడుదొడుకుల‌ను అధిగ‌మించి ఎక్కువ రాబ‌డిని ఇస్తాయి. అయితే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ల ప‌రిస్థితి దేశంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌క‌రంగా ఉంది. క‌రోనా వైర‌స్ సంక్షోభంతో మార్కెట్లు కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో రెండేళ్ల‌ సిప్ రాబ‌డులు ప్ర‌తికూలంగా మారాయి. అయితే నాలుగేళ్ల సిప్ రాబ‌డి వార్షికంగా కొంత పెరిగింది. లార్జ్ క్యాప్ సూచీలో (బీఎస్ఈ 100) పెట్టుబ‌డులు వార్షికంగా ఏప్రిల్ 22 నాటికి 0.42 శాతం, మిడ్ క్యాప్ 0.19 శాతం, స్మాల్ క్యాప్ -0.01 శాతం రాబ‌డిని న‌మోదుచేశాయి.

ఒక్క‌సారి ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత ఈక్విటీలు పుంజుకొని దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించిన రాబ‌డులు ఇస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి సంక్షోభం ఎదురైన‌ప్పుడు దిద్దుబాట్లు జ‌రిగిన సంగ‌తిని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే దీర్ఘ‌కాలిక లక్ష్యాల కోసం పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాల్సిందిగా సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని