ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో త‌ప్పులుంటే స‌వ‌రించొచ్చా..?

ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో మార్పులు / దిద్దుబాట్లు చేయ‌డానికి అనుమ‌తి ఉంటుంది.

Updated : 05 Nov 2021 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్‌ (NSC), సుక‌న్య స‌మృద్ధి యోజన (SSY), ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మొద‌లైన ప‌థ‌కాల్లో చేసిన పెట్టుబ‌డుల‌కు సెక్షన్‌ 80సీ కింద పన్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈ సెక్షన్‌ కింద మిన‌హాయింపుకు అర్హత ఉన్న ప‌థ‌కాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 1.5 ల‌క్షల వరకు మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. పన్ను ప్రయోజనం కోసం ఇటువంటి అన్ని ప‌థ‌కాల మొత్తం పెట్టుబ‌డి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, సెక్షన్‌ 80సీ కింద అర్హత ఉన్న ప‌థ‌కాల్లో పెట్టుబ‌డుల‌ను చూపించ‌డం ముఖ్యం. దీన్ని రిట‌ర్న్‌లో చూపించ‌డం విఫ‌ల‌మైతే ఆర్ధిక సంవ‌త్సరంలో అటువంటి పెట్టుబ‌డికి ప‌న్ను ప్రయోజనం ఉండదు.

అయితే, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ దాఖ‌లు చేసేట‌ప్పుడు సెక్షన్‌ 80సీ కింది పెట్టుబడిని చూపించడం మరిచిపోతే, గ‌డువు తేదీలోగా ఆదాయ‌పు ప‌న్ను రివైజ్డ్‌ రిట‌ర్న్ దాఖ‌లు చేయొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన పెట్టుబ‌డికి వ‌చ్చే సంవ‌త్సరంలో మీరు సెక్షన్‌ 80సీ కింద మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌లేరు. ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల ప్రకారం.. మీరు ఏ సంవ‌త్సరంలో పెట్టుబ‌డి పెట్టారో చూపించాలి. కాబట్టి 2020-21 ఆర్థిక సంవత్సారానికి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో దాన్ని చూపించ‌క‌పోతే ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌ను స‌వ‌రించే ఎంపిక‌ను ఉప‌యోగించొచ్చు. 

ఆదాయ‌పు ప‌న్ను నియ‌మాలు:

ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో మార్పులు / దిద్దుబాట్లు చేయ‌డానికి అనుమ‌తి ఉంటుంది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లో ప‌న్ను చెల్లింపుదారుడు ఏదైనా మిన‌హాయింపు లేదా త‌ప్పు స్టేట్‌మెంట్ ఉన్నట్లు గమనించినట్లయితే, స‌వ‌రించిన రిట‌ర్న్‌ను అందించ‌డానికి ఈ విభాగం అనుమ‌తిస్తుంది. కొవిడ్-19 కార‌ణంగా 2020-21 ఆర్థిక సవంత్సరంలో సవ‌రించిన ఆదాయ ప‌న్ను రిట‌ర్న్ ఫైల్ చేయ‌డానికి చివ‌రి తేదీ 31 మార్చి 2022 వ‌ర‌కు పొడిగించారు. ఆదాయ ప‌న్ను రిట‌ర్న్ దాఖ‌లు చేయ‌డానికి చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 31, 2021.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని