Rolls Royce: కరోనా సమయంలో కూడా రోల్స్‌-రాయిస్‌ రికార్డుస్థాయి విక్రయాలు

విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్‌-రాయిస్‌ 2021లో భారీగా విక్రయాలను పెంచుకొంది. కరోనా ప్రభావం, సెమికండక్టర్స్‌ కొరత వంటివి

Published : 11 Jan 2022 16:39 IST

లండన్‌: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ రోల్స్‌-రాయిస్‌ 2021లో భారీగా విక్రయాలను పెంచుకొంది. కరోనా ప్రభావం, సెమికండక్టర్స్‌ కొరత వంటివి కూడా రోల్స్‌ రాయిస్‌ దూకుడును ఆపలేకపోయాయి. గతేడాది మొత్తం విక్రయాలు 50శాతం పెరిగి 5,586కు చేరాయి. ముఖ్యంగా అమెరికా, ఆసియా-పసిఫిక్‌, గ్రేటర్‌ చైనా వంటి చోట్ల విక్రయాల్లో పెరుగుదల చోటు చేసుకొంది. రోల్స్‌-రాయిస్‌ ఘోస్ట్‌ కూపే కారుకు మంచి డిమాండ్‌ వచ్చింది. 2.5టన్నుల బరువున్న  కారు ధర 3,50,000 యూరోలు.

‘‘2021 రోల్స్‌-రాయిస్‌కు అద్భుతమైన సంవత్సరం. ఈ సంస్థ 117 ఏళ్ల చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయి డెలివరీలు చేయలేదు. మా ఉత్పత్తులకు ఇంత డిమాండ్‌ చూడలేదు’’ కంపెనీ మోటార్‌ కార్స్‌ విభాగం సీఈవో టోర్‌స్టెన్‌ ముల్లర్‌ ఆట్‌వోస్‌ పేర్కొన్నారు. 1998లో రోల్స్‌-రాయిస్‌ను జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ కొనుగోలు చేసింది. బ్రిటన్‌లోని కార్ల సంస్థలు మొత్తం 1.65 మిలియన్‌ వాహనాలను 2021లో ఉత్పత్తి చేసినట్లు ది సొసైటీ ఆఫ్‌ మోటార్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్‌  అండ్‌ ట్రేడర్స్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని