రూ.2.54 లక్షల కోట్ల పసిడి దిగుమతి

గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.54 లక్షల కోట్ల (34.6 బిలియన్‌ డాలర్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. 2019-20లో దిగుమతి అయిన రూ.2లక్షల కోట్ల (28.23 బి.డా.) పసిడితో పోలిస్తే, ఇది 22.58 శాతం

Published : 19 Apr 2021 01:54 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.54 లక్షల కోట్ల (34.6 బిలియన్‌ డాలర్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. 2019-20లో దిగుమతి అయిన రూ.2లక్షల కోట్ల (28.23 బి.డా.) పసిడితో పోలిస్తే, ఇది 22.58 శాతం అధికం. అయితే వెండి దిగుమతి 71 శాతం తగ్గి 791 మిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అయినా కూడా వాణిజ్యలోటు 161.3 బి.డా. నుంచి 98.56 బి.డా.కు పరిమితమైంది.


2025 నాటికి టీవీ చందా ఆదాయం రూ.92,000 కోట్లు!
 మీడియా పార్ట్‌నర్స్‌ ఆసియా నివేదిక

దిల్లీ: దేశంలో టీవీ చూసేందుకు జరిపే చందా ఆదాయం (పేటీవీ) 2025 నాటికి 12.3 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.92,000 కోట్లు) చేరే అవకాశం ఉందని అడ్వైజరీ, కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ మీడియా పార్ట్‌నర్స్‌ ఆసియా (ఎంపీఏ) నివేదిక వెల్లడించింది. అప్పటికి 96 శాతం భారత పే-టీవీ గృహాలు డిజిటలీకరణ చెందుతాయని పేర్కొంది. పే-టీవీ చందాదార్ల సంఖ్య 13.4 కోట్లకు చేరుతుందని తెలిపింది. కేబుల్‌, శాటిలైట్‌, టెలిఫోన్‌ కంపెనీల ద్వారా టెలివిజన్‌ సేవ పొందుతున్న గృహాలను పే-టీవీ గృహాలుగా పరిగణిస్తారు. ఇంటర్నెట్‌ స్ట్రీమింగ్‌ సేవలైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటివి దీని కిందకు రావు. ఇదిలా ఉంటే, డీటీహెచ్‌ (డైరెక్ట్‌ టు హోమ్‌) చందాదార్లు 2020లో 5.8 కోట్లు ఉండగా, 2025 నాటికి 6.8 కోట్లకు చేరతారని పేర్కొంది. కేబుల్‌ పే-టీవీ చందాదార్లు 2020లో  54 శాతం కాగా, 2025కు 46 శాతానికి తగ్గుతారని తెలిపింది.
* టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తీసుకొస్తున్న నిబంధనలతో పే-టీవీ కంటెంట్‌పై పెట్టుబడులు పరిమితంగా ఉంటాయని ఎంపీఏ పేర్కొంది. టెలికాం కంపెనీల సగటు వినియోగదారు ఆదాయ వృద్ధిపై (ఆర్పు) ప్రభావం పడటం దీనికి కారణమని తెలిపింది.

* ఎంపీఏ ప్రకారం, మొత్తం పే-టీవీ పరిశ్రమ ఆదాయం (చందా+ప్రకటనలు) 2020లో 10 శాతం మేర క్షీణించి 8.9 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.67,000 కోట్లు) నమోదైంది. కొవిడ్‌-19 ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ తిరోగమన బాట పట్టడంతో ప్రకటనల ఆదాయం తగ్గడమే దీనికి కారణమని విశ్లేషించింది.
* పే-టీవీ ప్రకటనల ఆదాయం గత ఏడాది 25 శాతం క్షీణించగా, 2020-25 మధ్య కాలంలో 12 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదు చేస్తుందని అంచనా వేసింది.
* పే-టీవీ బ్రాడ్‌కాస్టర్లు 2020లో 4.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.33,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇందులో 62 శాతం ప్రకటనల ద్వారా, 38 శాతం చందాల ద్వారా సమకూరింది. అయితే ఇది 2019తో పోలిస్తే 17 శాతం తక్కువ.
* ఛానెల్‌ వ్యాపారంలో వచ్చే రెండేళ్లలో వేగంగా రికవరీ కనిపిస్తుంది. ఈ వృద్ధికి ప్రాథమికంగా ప్రకటనలే దోహదం చేస్తాయని ఎంపీఏ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని