వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.53,346 కోట్లు 

ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రవేశపెట్టిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం ద్వారా ప్రభుత్వానికి ఫిబ్రవరి 22 వరకు రూ.53,346 కోట్లు వచ్చాయి. ఈ పథకం కింద పన్నుల వివాద పరిష్కారానికి 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని పార్లమెంటుకు

Updated : 09 Mar 2021 11:10 IST

దిల్లీ: ప్రత్యక్ష పన్నుల వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రవేశపెట్టిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం ద్వారా ప్రభుత్వానికి ఫిబ్రవరి 22 వరకు రూ.53,346 కోట్లు వచ్చాయి. ఈ పథకం కింద పన్నుల వివాద పరిష్కారానికి 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలియజేశారు. వీటితో ముడిపడి ఉన్న మొత్తం పన్ను బకాయిల విలువ రూ.98,328 కోట్లు అని తెలిపారు. ఇందులో రూ.53,346 కోట్లు వసూలయ్యాయని వెల్లడించారు. వివాద్‌ సే విశ్వాసం పథకం ప్రారంభం వెనక ఉద్దేశం సాకారమైందా అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రి సాకారమైందని చెబుతూ పై వివరాలు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు