Airtel Offer: స్మార్ట్‌ఫోన్‌ కొంటే రూ.6వేలు వాపస్‌: ఎయిర్‌టెల్‌

తమ వెబ్‌సైట్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రూ.6వేలు నగదు వాపస్‌ ఇస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

Updated : 09 Oct 2021 09:27 IST

36 నెలలపాటు రూ.249 రీఛార్జీ చేస్తేనే

ఈనాడు, హైదరాబాద్‌: తమ వెబ్‌సైట్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రూ.6వేలు నగదు వాపస్‌ ఇస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడేళ్లలో, రెండు వాయిదాల్లో అందించనున్నట్లు శుక్రవారం తెలిపింది. రూ.12వేల వరకు విలువైన మొబైల్‌ స్మార్ట్‌ ఫోన్లు కొన్న వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. శాంసంగ్‌, షావోమీ, వివో, ఒప్పో, రియల్‌మి, నోకియా, ఐటెల్‌, లావా, ఇన్ఫీనిక్స్‌, టెక్నో, లెనోవో, మోటారోలా బ్రాండ్లకు చెందిన దాదాపు 150కి పైగా స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లకు ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నగదు వాపసు కోసం వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌ కొన్నాక రూ.249 ప్రీ పెయిడ్‌ ప్యాక్‌తో రీఛార్జీ చేసుకోవాలి. ఆ తర్వాత వరుసగా 36 నెలలపాటు దీన్ని కొనసాగించాలి. ఇలా రీఛార్జి చేస్తుంటే 18 నెలల అనంతరం నగదు వెనక్కిలో తొలి వాయిదా కింద రూ.2,000 వస్తాయి. 36 నెలలు ముగిశాక రూ.4,000ను ఎయిర్‌టెల్‌ ఇస్తుంది. ‘నా మొదటి స్మార్ట్‌ఫోన్‌’ పథకం కింద వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌కు మారేలా ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. ఫోను పగిలిపోతే.. ఒకసారి స్క్రీన్‌ను మార్చి ఇచ్చే వెసులుబాటూ కల్పిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని