పీపీఎఫ్ పెట్టుబ‌డుల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ తోపాటు, రుణం తీసుకునే అవ‌కాశం కూడా ఉంది.......

Published : 19 Dec 2020 10:47 IST

పీపీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ తోపాటు, రుణం తీసుకునే అవ‌కాశం కూడా ఉంది.​​​​​​​

ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌) స్కీమ్ ప్రారంభించి ఈ ఏడాదితో యాభై ఏళ్లు పూర్త‌వుతుంది. పీపీఎఫ్‌ను 1968 లో ప్రారంభించారు. రిస్క్ లేకుండా దీర్ఘ‌కాలీక పెట్టుబ‌డులు, క‌చ్చితమైన రాబ‌డులు కోరుకునేవారికి ఇదొక మంచి ఆప్ష‌న్. ఇటీవ‌ల కాలంలో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు పెరుగుతున్న‌ప్ప‌టికీ, పీపీఎఫ్ పెట్టుబ‌డుల్లో రిస్క్ ఉండ‌దు, కాబ‌ట్టి దీనిపై కూడా మొగ్గుచూపుతున్నారు. అయితే పీపీఎఫ్‌పై అంద‌రికీ పూర్తిగా అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. ఈ పెట్టుబ‌డులును ప్రారంభించేముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి.

  1. మెచ్యూరిటీ త‌ర్వాత గ‌డువు పొడ‌గింపు

పీపీఎఫ్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత గ‌డువు పూర్త‌వుతుంది. అయితే మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత కూడా ఖాతా మ‌రింత కాలం కొన‌సాగించే అవ‌కాశం ఉంది. ఆ స‌మ‌యంలో డ‌బ్బు డిపాజిట్ చేసినా చేయ‌కోయినా గ‌డువు పెంచుకోవ‌చ్చు. 5 ఏళ్ల చొప్పున గ‌డువు పొడ‌గించుకోవ‌చ్చు. ఒక‌వేళ మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత ఖాతాలో ఎలాంటి డిపాజిట్ చేయ‌కుండా కొన‌సాగించాల‌నుకుంటే మీ బ్యాంకు శాఖ‌కు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం లేదు. ఖాతాలో ఉన్న న‌గదుపై వడ్డీ మునుప‌టిలాగానే వ‌ర్తిస్తుంది. అయితే మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత కూడా డిపాజిట్ చేస్తూ ఖాతాను కొన‌సాగించాల‌నుకుంటే మీ బ్యాంకు లేదా పోస్టాఫీస్ శాఖ‌లో తెలియజేయాలి. అది కూడా మెచ్యూరిటీ పూర్తి అయిన ఏడాది లోపే వారికి స‌మాచారం అందించాలి.

  1. పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ స‌దుపాయం

పీపీఎఫ్ లో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంది. అయితే అది కూడా ఏడేళ్ల త‌ర్వాత‌ ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో మాత్ర‌మే, డబ్బు ఉపసంహరించే వీలుంటుంది. ఇలా ఏడవ సంవత్సరం నుంచి మొదలుపెట్టి, ప్ర‌తీ సంవ‌త్స‌రానికి ఒకసారి మాత్రమే ఉపసంహరణ చేసే అవకాశం ఉంటుంది.పీపీఎఫ్ పెట్టుబ‌డులకు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. మెచ్యూరిటీ ముగియ‌క‌ముందే తీసుకున్న న‌గ‌దుపై కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే ఐటీ రిట‌ర్నుల స‌మ‌యంలో పీపీఎఫ్ విత్‌డ్రా వివ‌రాల‌ను తెలియ‌జేయాలి.

  1. పీపీఎఫ్ ఖాతా ముందస్తు మూసివేత‌

పీపీఎప్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాలు లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే కొన్ని ప్ర‌త్యే క నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. కానీ 5 ఏళ్లు పూర్త‌యిన త‌ర్వాతే ఖాతా మూసివేత‌కు అవ‌కాశం ఉంటుంది. తీవ్రమైన వ్యాదుల చికిత్స‌, ఉన్న‌త విద్య వంటి అత్య‌వ‌స‌రాల‌కే పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. అయితే దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌వ‌ల‌సి ఉంటుంది. చికిత్స కోసం అయితే వైద్య దృవీక‌ర‌ణ పత్రాలు, ఉన్న‌త విద్య కోసం అయితే దేశం లేదా విదేశాల్లో విద్యాసంస్థ‌లో చేరిన‌ట్లుగా తెలిపే అడ్మిస‌న్ ఫీజులు వంటివి ఉండాలి. ఖాతాను ముందుగా మూసివేస్తే సాధార‌ణం కంటే 1 శాతం త‌క్కువ‌గా వ‌స్తుంది.

  1. పీపీఎఫ్‌పై రుణ సదుపాయం

ఒకవేళ మీరు పీపీఎఫ్ ఖాతాపై రుణాలను పొందాలనుకుంటే, మీరు ఖాతాను తెరిచిన రోజు నుంచి మూడు సంవత్సరాల తరువాత రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం ఐదవ ఆర్థిక సంవత్సరం వరకు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. అలాగే సంవత్సరానికి కేవ‌లం ఒక్క‌సారే రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 2018-19 ఆర్థ‌క సంవ్స‌రంలో మీరు రుణానికి దాఖ‌లు చేస్తే మార్చి 31, 2017 వ‌ర‌కు ఖాతాలో ఉన్న మొత్తంలో 25 శాతం మాత్ర‌మే రుణం ల‌భిస్తుంది.

  1. పీపీఎఫ్ ఖాతా బ‌దిలీ

బ్యాంకు, పోస్టాఫీసుల్లోని వారు త‌మ ఖాతాల‌ను బ్యాంక్ నుంచి పోస్టాఫీసుకు లేదా పోస్టాఫీసు నుంచి బ్యాంకుకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. లేదా ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కీ మార్చుకోవ‌చ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులోనే ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు ప్ర‌స్తుతం మీ ఖాతా ఉన్న శాఖ‌ను సంప్ర‌దించి వేరే శాఖ‌కు మార్చాల‌ని ఒక ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పిస్తే చాలు. ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి ఒక రోజు నుంచి ఏడు రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చుకోవాల‌నుకున్న‌ప్పుడు మీ పీపీఎఫ్ పాస్‌బుక్‌తో ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీస్‌కి వెళ్లి, మీరు బ‌దిలీ కోరుకుంటున్న బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖ వివ‌రాలతో కూడిన ద‌ర‌ఖాస్తున్న ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో స‌మ‌ర్పించండి.

మీ ద‌ర‌ఖాస్తు అందిన వెంట‌నే, ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్నశాఖ అధికారులు బ‌దిలీ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు. మీ ద‌ర‌ఖాస్తుకి సంబంధించిన ర‌శీదును తీసుకోండి. ప్ర‌స్తుతం మీకు ఖాతా ఉన్న శాఖ అధికారులు ఈ కింద వివ‌రించిన ప‌త్రాల‌ను మీరు బ‌దిలీ కోరుకుంటున్న శాఖ‌కు పంపుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని