గ్రామీణ త‌పాలా శాఖ‌ జీవిత బీమా (ఆర‌్‌పీఎల్ఐ)

త‌పాల శాఖ గ్రామీణ ప్రాంతాల వారికి అందించే బీమా ప‌థ‌కాలు

Published : 22 Dec 2020 16:10 IST

త‌పాల జీవిత బీమా, త‌మ బీమా వ్యాపారాన్ని మార్చి 3,1995 నుండి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్త‌రించింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం త‌పాల శాఖ వారు గ్రామీణ ప్రాంతాల‌లో విస్తార‌మైన నెట్వ‌ర్క్ ను క‌లిగి ఉండ‌డ‌మే కాక త‌క్కువ ఖ‌ర్చుతో త‌మ కార్య‌క‌లాపాలను నిర్వ‌హించ‌గ‌ల‌గ‌డం. గ్రామీణ ప్రాంతాల‌లో ఉన్న‌సాదార‌ణ ప్ర‌జ‌ల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి, ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంత‌ల‌లో ప‌నిచేయు మ‌హిళ‌ల‌కు, బీమా గురించిన అవగాహ‌న క‌ల్పించ‌డమే ప్రాధ‌న ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. మార్చి 31,2017 నాటికి 146 ల‌క్ష‌ల కంటే ఎక్కువ పాల‌సీల‌ను ఉన్నాయి.

ఆర్‌పీఎల్ఐ ప్ర‌వేశ అర్హ‌త‌లు:
గ్రామీణ ప్రాంతంలో స్థిరంగా నివ‌సించే పురుషులు, మహిళ‌లు ఇది వ‌ర్తిస్తుంది.

ఆర‌్‌పీఎల్ఐ అందించే 6 ర‌కాల బీమా పాల‌సీలు:

  1. హోల్ లైఫ్ పాల‌సీ - గ్రామ సుర‌క్షా

  2. ఎండోమెంట్ పాల‌సీ- గ్రామ సంతోష్‌

  3. క‌న్వ‌ర్ట‌బుల్ హోల్ లైఫ్ పాల‌సీ - గ్రామ సువిధ‌

  4. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ - గ్రామ‌ సుమంగ‌ళ్‌

  5. 10 సంవ‌త్స‌రాల ఆర్‌పీఎల్ఐ ( గ్రామ ప్రియ ) - యుగ‌ళ్ సుర‌క్షా

  6. పిల్లల పాల‌సీ - బాల జీవ‌న్ బీమా

ఆర్‌పీఎల్ఐ బీమా ప‌థ‌కాల‌ ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు:

  1. హోల్ లైఫ్ పాల‌సీ- గ్రామ సుర‌క్షా :

  • ఈ ప‌థ‌కం ద్వారా బీమా చేసిన వ్యక్తికి 80 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌ర్వాత భీమా హామీ మొత్తాన్ని, బోన‌స్‌తో క‌లిపి ఇస్తారు.

  • ఒక వేళ బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్ల‌యితే అత‌ని/ఆమె చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు ఈ మొత్తాన్ని అంద‌చేస్తారు. పాల‌సీ అమ‌లులో వుండ‌గా ఏది ముందుగా సంభ‌విస్తుందో దాని ప్ర‌కారం క్ల‌యిమ్‌ చేసిన తేదీ నుండి అమ‌లు ప‌రుస్తారు.

  • పాల‌సీదారుని వ‌య‌స్సు 19 నుండి 55 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • బీమా క‌నీస హామీ రూ.10,000. గ‌రిష్ట హామీ రూ.10ల‌క్ష‌లు.

  • బీమా చేసిన 4 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 65 బోన‌స్ అందిస్తున్నారు.

  1. ఎండోమెంట్ పాల‌సీ - గ్రామ సంతోష్‌ :

  • ఈ ప‌థ‌కం కింద బీమా చేసిన వారు ముందుగా నిర్ణయించుకున్న 35,40,45,50,55,58, 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు త‌రువాత‌ బీమా హామీ, బోన‌స్‌ల‌ను అంద‌చేస్తారు.

  • ఒక వేళ పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే బీమా హామీ, బోన‌స్‌ను వారి నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • పాల‌సీదారుని వ‌య‌స్సు 19 నుండి 55 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • బీమా క‌నీస హామీ రూ.10,000. గ‌రిష్ట హామీ రూ.10ల‌క్ష‌లు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 50 బోన‌స్ అందిస్తున్నారు.

రూర‌ల్‌ ఎండోమెంట్‌ పాల‌సీ - నెల‌వారీ ప్రీమియం ప‌ట్టిక‌

  1. క‌న్వ‌ర్ట‌బుల్ హోల్ లైఫ్ పాల‌సీ - గ్రామ సువిధ‌

ఇది కూడా జీవిత మొత్తం హామీ నందించే హోల్ లైఫ్ పాల‌సీ వ‌లే వ్య‌వ‌హ‌రిస్తుంది. అయితే బీమా చేసిన 5 సంవ‌త్స‌రాల అనంత‌రం ఎండోమెంట్ పాల‌సీకి మారేందుకు అవ‌కాశం ఉంటుంది.

  • కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన త‌దుప‌రి బీమా హామీ, బోన‌స్‌ల‌ను ఇస్తారు.

  • ఒక వేళ పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే బీమా హామీ, బోన‌స్‌ను వారి నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • పాల‌సీదారుని వ‌య‌స్సు 19 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • భీమా క‌నీస హామీ రూ.10,000. గ‌రిష్ట హామీ రూ.10ల‌క్ష‌లు.

  • భీమా చేసిన 4 సంవ‌త్స‌రాల అనంత‌రం నుండి రుణం తీసుకోవ‌చ్చు.

  • బీమా చేసిన 3 సంవ‌త్స‌రాల త‌రువాత తిరిగి ఇచ్చివేయ‌చ్చు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 65 బోన‌స్ అందిస్తున్నారు. (ఇది హోల్ లైఫ్ పాల‌సీ నుండి ఎండోమెంట్ పాల‌సీకి మార్పు చెంద‌ని వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.)

రూర‌ల్ క‌న్వ‌ర్ట‌బుల్ హోల్ లైఫ్ పాల‌సీ - నెల‌వారి ప్రీమియం ప‌ట్టిక‌

  1. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ- గ్రామ సుమంగ‌ళ్‌

ఇది గ‌రిష్టంగా రూ.10ల‌క్ష‌లు. బీమా హామీ అందించే మ‌నీ బ్యాక్ పాల‌సీ.నిర్ణీత కాల ప‌రిమితిలో తిరిగి వ‌చ్చే హామీ మొత్తాల‌ను ఆశించేవారికి బాగుంటుంది.

  • నిర్ణీత కాల ప‌రిమితిలో నిర్ధిష్ట హామీ మొత్తాన్ని తిరిగి పొంద‌వ‌చ్చు.

  • ఒక‌వేళ బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే ముందు చెల్లించిన బీమాను మిన‌హాయించకుండా పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను చెల్లిస్తారు. అటువంటి సంద‌ర్భాల‌లో బీమా హామీ, బోన‌స్‌ల మొత్తాన్ని నామినీ లేదా చ‌ట్ట‌బ‌ధ్ద‌మైన వార‌సుల‌కు అంద‌చేస్తారు.

  • పాల‌సీ నిర్ణీత స‌మయం 15, 20 సంవ‌త్స‌రాలు

  • నిర్ణీత కాల ప‌రిమితిలో తిరిగి వ‌చ్చే హామీ మొత్తం-

  • 20 సంవ‌త్స‌రాల పాల‌సీకి 19 నుండి 40 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • 15 సంవ‌త్స‌రాల పాల‌సీకి 19 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • నిర్ణీత కాల ప‌రిమితిలో తిరిగి వ‌చ్చే హామీ మొత్తం-
    20 సంవ‌త్స‌రాల పాల‌సీకి ప్ర‌తి 8, 12,16 సంవ‌త్స‌రాల‌కు 20 శాతం చొప్పున ఇస్తారు. కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన అనంత‌రం మిగిలిన‌ 40 శాతం, బోన‌స్ ఇస్తారు.
    15 సంవ‌త్స‌రాల పాల‌సీకి ప్ర‌తి 6,9,12 సంవ‌త్స‌రాల‌కు 20 శాతం చొప్పున ఇస్తారు. కాల‌వ్య‌వ‌ధి అనంత‌రం మిగిలిన‌ 40 శాతం, బోన‌స్ ఇస్తారు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 47 బోన‌స్ అందిస్తున్నారు.

రూర‌ల్ యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ పాల‌సీ - నెల‌వారి ప్రీమియం ప‌ట్టిక‌

  1. 10 సంవ‌త్స‌రాల ఆర్‌పీఎల్ఐ - గ్రామ ప్రియ‌:

గ్రామీణ ప్రాంతాల వారి కోస‌మే ప్ర‌వేళ‌పెట్టిన స్వ‌ల్ప‌కాల మ‌నీ బ్యాక్ బీమా ప‌థ‌క‌ము.

  • బీమా చేసిన వ్య‌క్తి త‌ను హామీ మొత్త‌న్ని10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో జీవిత బీమాను పొంద‌గ‌లడు.

  • 4 సంవ‌త్స‌రాల త‌రువాత 20 శాతం, 7 సంవ‌త్స‌రాల త‌రువాత మ‌రో 20 శాతం, ప‌ది సంవ‌త్స‌రాల త‌రువాత మిగిలిన 60 శాతం హామీ మొత్తం పొందుతారు.

  • ప్ర‌వేశ వ‌య‌స్సు 20 నుండి 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • భీమా క‌నీస హామీ రూ.10,000. గ‌రిష్ట హామీ రూ.10ల‌క్ష‌లు.

  • వ‌ర‌ద‌లు, భూకంపాలు, తుపానులు, క‌రువు వంటి ప్ర‌కృతి విప‌త్తులు సంబవించిన‌ప్పుడు ఒక సంవ‌త్స‌రం వ‌ర‌కు ప్రీమియం చెల్లించ‌క పోతే ఆల‌స్య రుసుము విధించ‌రు.

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 47 బోన‌స్ అందిస్తున్నారు.

గ్రామ ప్రియ‌ - నెల‌వారి ప్రీమియం ప‌ట్టిక‌

  1. పిల్ల‌ల పాల‌సీ - బాల్ జీవ‌న్ బీమా

పాల‌సీదారుని పిల్ల‌ల‌కు బీమా ప్ర‌యోజ‌నాల అందిస్తున్నారు.

  • పాల‌సీదారుని ఇద్ద‌రు పిల్ల‌ల వ‌ర‌కు పాల‌సీ ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్నారు.

  • పిల్ల‌ల ప్ర‌వేశ వ‌య‌స్సు 5 నుండి 20 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.

  • త‌ల్లి/త‌ండ్రి చేసిన బీమా మొత్తం 1 ల‌క్ష‌కు మించ‌కుండా ఇస్తారు.

  • పాల‌సీ దారుని ప్రవేశ వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాల‌కు మించ‌కూడ‌దు.

  • ఒక‌వేళ‌ పాల‌సీదారుడు (త‌ల్లి/త‌ండ్రి) మ‌ర‌ణిస్తే వారి పిల్ల‌లు ఎటువంటి ప్రీమియం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. కాల‌వ్య‌వ‌ధి పూర్తి అయిన అనంత‌రం బీమా హామీ, బోన‌స్‌ల‌ను పిల్ల‌ల‌కు అంద‌చేస్తారు.

  • పిల్ల‌ల‌కు ఏలాంటి వైద్య ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేదు. అయితే పిల్ల‌లు ఆరోగ్యంగా వుండాలి. పాల‌సీ ప్రారంభించిన నాటి నుండి ఇది అమ‌లు జ‌రుగుతుంది.
    ఎండోమెంట్ విధ‌నంలో ఇచ్చే బోన‌స్‌ను ఇస్తారు

  • చివ‌రిగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం రూ.1000 హామీపై రూ. 50 బోన‌స్ అందిస్తున్నారు.

ఆర‌్‌పీఎల్ఐలో ఈ కింద ప్ర‌యెజ‌నాలు అందుబాటులో ఉన్నాయి.

  1. నామీని మార్పు.

  2. పాల‌సి ఇచ్చు అధికారి అనుమ‌తితో, ఎండోమెంట్ పాల‌సీ చేసిన మూడు సంవ‌త్స‌రాల అనంత‌రం, హోల్ లైఫ్ పాల‌సీ చేసిన నాలుగు సంవ‌త్స‌రాల అనంత‌రం లోను పొంద‌వ‌చ్చు.

  3. ఏదైనా ఫైనాన్సియ‌ల్ సంస్థ‌కు పాల‌సీని ఇచ్చి రుణం పొంద‌వ‌చ్చు.

  4. మూడు సంవ‌త్స‌రాల లోపు పాల‌సీకి సంబంధించి వ‌రుస‌గా 6 ప్రీమియంలు చెల్లించ‌క పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది.
    మూడు సంవ‌త్స‌రాలుకు మించి ఉన్న పాల‌సీకి సంబంధించి వ‌రుస‌గా 12 ప్రీమియంలు చెల్లించ‌క‌పోతే పాల‌సీ ర‌ద్ద‌వుతుంది.

  5. ఓరిజిన‌ల్‌ బాండ్ ప్ర‌మాద‌వసాత్తు న‌లిగిపోయిన‌, కాలిపోయిన‌, చిరిగిపోయిన‌, సంద‌ర్భాల‌లో డూప్లికేట్ బాండ్ ఇస్తారు.

  6. హోల్ లైఫ్ పాల‌సీ- గ్రామ సుర‌క్ష నుండి ఎండోమెంట్ పాల‌సీ- గ్రామ సంతోష్ బీమాలోని మార్పు చెందాల‌నుకున్న‌, ఎండోమెంట్ పాల‌సీ- గ్రామ సంతోష్ బీమా నుండి కొంత హామీ త‌గ్గింపుతో వేరే ఇత‌ర ఎండోమెంట్ పాల‌సీ- గ్రామ సంతోష్ లోనికి మార్పుచెందాలనుకున్న ఇచ్చిన‌ నిబంధ‌న‌ల అనుస‌రించాల్సి ఉంటుంది.

త్రైమాసిక, వార్షిక ప్రీమియంల కోసం, మ‌రిన్ని వివ‌రాల‌కు మీ ద‌గ్గ‌ర‌లోని పోస్టాఫీసును సంప్ర‌దించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని