SBI savings account: మొబైల్ నెంబ‌రు రిజిస్ట్రేష‌న్‌, అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే.. 

ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ స‌దుపాయం కోసం ఎస్‌బీఐ పొదుపు ఖాత‌కు మొబైల్ నెంబ‌రును లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. 

Updated : 23 Nov 2021 16:13 IST

ప్ర‌స్తుతం దాదాపు ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. డ‌బ్బుకి సంబంధించి ఏలాంటి లావాదేవీలు చేయాల‌న్నా పొదుపు ఖాతా ఉండాల్సిందే. అయితే, మీ ఖాతాలో జ‌రిగే లావాదేవీల గురించి త‌క్ష‌ణ స‌మాచారం కోసం పొదుపు ఖాతాతో మొబైల్ నెంబ‌రు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మీ పొదుపు ఖాతాలో ఏవైనా లావాదేవీలు జ‌రిగితే మీకు వెంట‌నే మెసేజ్ వ‌స్తుంది. దీంతో అన‌ధికారంగా జ‌రిగే లావాదేవీలను ట్రాక్ చేయ‌వ‌చ్చు. 

భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు ఖాతా ఉన్న వారు ఇంట‌ర్నెట్  బ్యాంకింగ్ స‌దుపాయం పొందేందుకుగానూ బ్యాంకు ఖాతాతో మొబైల్ నెంబ‌రును రిజిస్ట‌ర్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. అలాగే నెంబ‌రు మార్చిన ప్ర‌తీసారి బ్యాంకులో త‌మ మొబైల్ నెంబ‌రును అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పొదుపు ఖాతాకు మొబైల్ నెంబ‌రును ఇప్ప‌టికీ అనుసంధానించ‌ని వారు ఎలా లింక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 

బ్రాంచీకి వెళ్లి రిజిస్ట్రేష‌న్/అప్‌డేట్ చేసే విధానం..
మీ ద‌గ్గ‌ర‌లోని ఎస్‌బీఐ బ్రాంచీకి వెళ్లి నెంబ‌రు అప్‌డేట్ చేయాల్సిందిగా లేఖ ద్వారా వ్రాతపూర్వ‌కంగా అభ్య‌ర్థించాలి. అవస‌ర‌మైన వెరిఫికేష‌న్ చేసి మొబైల్ నెంబ‌రును లింక్ చేస్తారు. స్టేట‌స్ అప్‌డేష‌న్ గురించి మొబైల్ నెంబ‌రుకు మెసేజ్ వ‌స్తుంది. 

ఎస్‌బీఐ ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నెంబ‌రును అప్‌డేట్ చేసుకునే విధానం..
* ముందుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్ www.onlinesbi.com కు లాగిన్ అవ్వాలి. 
* మై అక్కౌంట్ సెక్ష‌న్‌లో అందుబాటులో ఉన్న ప్రొఫైల్‌లో, ప‌ర్సనల్ డీటైల్స్‌(వ్య‌క్తిగ‌త వివ‌రాలు)లో అందుబాటులో ఉన్న చేంజ్ మొబైల్ నెంబ‌రుపై క్లిక్ చేయాలి. ఇది స్క్రీన్‌కి ఎడ‌మ వైపున క‌నిపిస్తుంది. 
* త‌ర్వాత పేజీలో అక్కౌంటు నెంబ‌రును ఎంచుకుని, మొబైల్ నెంబ‌రును ఇచ్చి స‌బ్మిట్ చేయాలి. 
* రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రు చివ‌రి రెండు అంకెలు క‌నిపిస్తాయి. 
* స్టేట‌స్‌ను రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రు ద్వారా చెక్ చేసుకోవ‌చ్చు. 

ఎస్‌బీఐ ఏటీఎమ్ ద్వారా..
* మీ ద‌గ్గ‌ర‌లోని ఏటీఎమ్‌కి వెళ్లి ఏటీఎమ్‌లో అందుబాటులో ఉన్న ఆప్ష‌న్ల‌లో రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. 
* ఏటీఎమ్ పిన్ ఎంట‌ర్ చేసి,  మొబైల్ నెంబ‌రు రిజిస్ట్రేష‌న్ చేయాల‌నుకుంటే రిజిస్ట్రేష‌న్‌ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి మొబైల్ నెంబ‌రును ఎంట‌ర్ చేయాలి. 
* ఒక‌వేళ‌ చేంజ్ చేయాల‌నుకంటే చేంజ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి పాత మొబైల్ నెంబ‌రును ఎంట‌ర్ చేసి, మ‌రోసారి నిర్థారించుకోవాలి. * ఇప్పుడు కొత్త నెంబ‌రును ఎంట‌ర్ చేసి, మ‌రోసారి నిర్ధారించ‌మ‌ని అడుగుతుంది. 
* ఇక్క‌డ‌ ఇచ్చిన మెసేజ్ తో  పాటు పాత, కొత్త మొబైల్ నెంబ‌ర్ల‌కు భిన్న ఓటీపీలు వ‌స్తాయి. ఇక్క‌డ ఇచ్చిన ఫార్మ‌ట్‌లో మీకు వ‌చ్చిన ఓటీపీ రిఫ‌రెన్స్ నెంబ‌రును ఎస్ఎమ్ఎస్ చేయాలి 
* నాలుగు గంట‌ల్లో ACTIVATE IOTP VALUE + REF NUMBER ను 567676కి మెసేజ్ చేయాలి. దీంతో మీ మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ అవుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని