SBI: కస్టమర్‌ కేర్‌ నంబరుకు కాల్‌ చేస్తున్నారా..? ఖాతాదారులకు ఎస్‌బీఐ అలర్ట్‌

ఈ రోజుల్లో మనకు ఏ సమాచారం కావాలన్న గూగుల్‌ సెర్చ్‌ చేయడం సాధారణమైపోయింది. చివరకు సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకుల కస్టమర్‌ కేర్‌

Published : 23 Nov 2021 02:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ రోజుల్లో మనకు ఏ సమాచారం కావాలన్న గూగుల్‌ సెర్చ్‌ చేయడం సాధారణమైపోయింది. చివరకు సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకుల కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం కూడా ఆయా అధికారిక సైట్లకు వెళ్లకుండా గూగుల్‌లోనే వెతుకుతున్నాం. అయితే మిగతా వాటి సంగతి పక్కనబెడితే.. బ్యాంకింగ్‌ విషయంలో అలా చేయడం తప్పంటోంది దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI). తప్పుడు కస్టమర్‌ కేర్‌ నంబర్లతో మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఖాతాదారులను హెచ్చరిస్తోంది.

మోసపూరిత కస్టమర్‌ కేర్‌ సెంటర్ల వలలో పడి ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్‌ చేస్తే ఖాతాలో డబ్బు పోగొట్టుకునే అవకాశముందని ఎస్‌బీఐ వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘‘మోసపూరిత కస్టమర్‌ కేర్‌ నంబర్లతో జాగ్రత్త. సరైన కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం దయచేసి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించండి. బ్యాంకింగ్‌కు సంబంధించిన రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోకండి’’ అని ఖాతాదారులను హెచ్చరించింది. నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లకు సంబంధించి ఎస్‌బీఐ గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని