Health Insurance: గూగుల్ పే ద్వారా ఎస్‌బీఐ ఆరోగ్య బీమా పాలసీ

ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ వినియోగ‌దారులు ఇక‌పై గూగుల్‌పే స్పాట్‌లో క్ష‌ణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయ‌చ్చు

Updated : 29 Oct 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సేవ‌ల‌ను విస్త‌రిస్తూ వస్తోంది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా పాల‌సీల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందించేందుకు గూగుల్‌పేతో ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్‌పే యాప్ ద్వారా ఇంటి నుంచే ఎటువంటి అవాంత‌రాలూ లేకుండా, త్వ‌రితగ‌తిన ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసేందుకు వీలు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

దేశంలోని బీమా సంస్థ‌తో గూగుల్ పే జ‌ట్టుకట్టడం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. క‌స్ట‌మ‌ర్లు ఇక‌పై గూగుల్‌పే స్పాట్‌లో క్ష‌ణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయొచ్చు. ఇక్క‌డ ఆరోగ్య బీమా పాల‌సీని ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ సంస్థ అందిస్తుంది. టెక్నిక‌ల్ స‌ర్వీస్‌ను మాత్ర‌మే గూగుల్ పే అందిస్తుంది. ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న అవ‌స‌రాలను తీర్చేందుకు.. ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను ఆరోగ్య బీమా ప‌రిధిలోకి తీసుకొచ్చేందుకు ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌, గూగుల్‌ పే జట్టుకట్టడం ఓ చక్కని ప్ర‌య‌త్నం అని ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్‌ తెలిపింది. అంతేకాకుండా గూగుల్‌పే స్పాట్ ద్వారా ఆరోగ్య సంజీవిని పేరుతో.. ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా ప్లాన్ అందిస్తున్న‌ట్లు తెలిపింది.

గూగుల్ పే స్పాట్‌లో..

* ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్‌ అందించే ఆరోగ్య సంజీవిని పాల‌సీ గూగుల్‌పే స్పాట్‌లో అందుబాటులో ఉంది. 
* ఆరోగ్య సంజీవని అనేది ఒక ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీ. అతి త‌క్కువ ప్రీమియంతో ప్రామాణిక కవరేజీని అందించేందుకు ఎస్‌బీఐ జ‌న‌ర‌ల్ హెల్త్ ఇన్సురెన్స్ ఈ పాల‌సీని ప్రారంభించింది.
* వినియోగదారులు గూగుల్‌పే స్పాట్‌ ద్వారా ఆరోగ్య సంజీవని పాలసీ కింద వ్యక్తిగత, కుటుంబ ప్లాన్‌లను కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని