ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేవైసీ అల‌ర్ట్‌..

కేవైసీ అప్‌డేట్ కోసం ఖాతాదారులు బ్రాంచ్‌కి వెళ్ళాల్సిన అవ‌స‌రం లేదు. ఇమెయిల్ / పోస్ట‌ల్ సేవ‌ల ద్వారా పూర్తి చేయ‌వ‌చ్చు. 

Published : 03 May 2021 11:21 IST

కోవిడ్ -19 రెండ‌వ ద‌శ వ్యాప్తి నేప‌థ్యంలో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ కస్టమర్లను అల‌ర్ట్ చేసింది. కేవైసీ( నో యుర్ క‌స్ట‌మ‌ర్‌) వివ‌రాల‌ను అప్‌డేట్ చేయాల‌ని ఖాతాదారుల‌ను కోరింది. మే 31 లోప‌ల ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని లేదంటే, ఖాతా సేవ‌లు పాక్షికంగా నిలిచిపోతాయ‌ని బ్యాంకు త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాతాదారులు బ్యాంకు బ్రాంచ్‌కి వ‌చ్చి వివ‌రాల‌ను అప్‌డేట్ చేయ‌డం క‌ష్టం అవుతుంది. అందువ‌ల్ల ఖాతాదారులు బ్యాంకు బ్రాంచి రావ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా వివ‌రాల‌ను అప్‌డేట్ చేసేందుకు అనుమ‌తించింది. ఇ-మెయిల్ ద్వారా గానీ పోస్ట‌ల్ సేవ‌ల ద్వారా గానీ అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.  ఈ రెండు విధానాల‌లో మీకు న‌చ్చిన విధానం ద్వారా వివ‌రాలు బ్యాంకు పంపితే వారు కేవైసీ అప్‌డేట్ చేస్తారు. 

కేవైసీ ఎందుకు..
నో యువర్ కస్టమర్ (కేవైసీ) అనేది బ్యాంకులు తమ వినియోగదారుల గుర్తింపు సమాచారాన్ని పొందే ప్రక్రియ. ఇది బ్యాంకు సేవ‌లు దుర్వినియోగం కాకుండా చూస్తుంది. ఒక వ్య‌క్తి బ్యాంకులో కొత్త‌గా ఖాతా తెరిచిన‌ప్పుడు కేవైసీ న‌మోదు చేయాల్సి ఉంటుంది. భ‌విష్య‌త్తులో అవ‌స‌రాన్ని బ‌ట్టి అప్‌డేట్ చేయ‌మ‌ని బ్యాంక్ ఖాతాదారుల‌ను కోరుతుంది. సాధార‌ణంగా అధిక రిస్క్ గ‌ల క‌స్ట‌మ‌ర్లు రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి, మ‌ధ్య‌స్థ రిస్క్ క‌స్ట‌మ‌ర్లు ఎనిమిది సంవ‌త్స‌రాల‌కు, త‌క్కువ రిస్క్ క‌స్ట‌మ‌ర్లు 10 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాకింగ్ మోసాల‌ను నివారించేందుకు, క‌స్ట‌మ‌ర్ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేయాల‌ని ఎస్‌బీఐ త‌న క‌స్ట‌మ‌ర్ల‌ను కోరింది. ఇదే బాట‌లో మిగిలిన బ్యాంకులు కూడా ప‌య‌నించే అవ‌కాశం ఉంది. 

కావ‌ల‌సిన ప‌త్రాలు..
* వ్యక్తులు (గుర్తింపు / చిరునామా రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాలు)
* పాస్‌పోర్ట్‌
* ఓట‌ర్ గుర్తింపు కార్డు 
* డ్రైవింగ్ లైసెన్స్‌
* ఆధార్ లెట‌ర్‌/కార్డ్‌
* NREGA కార్డ్‌ 
* పాన్ కార్డ్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని