SBI Opens Floating ATM: దాల్‌ సరస్సులో తేలియాడే ఏటీఎం..

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  దాల్‌సరస్సులో తేలియాడే ఏటీఎంను ఏర్పాటు చేసింది. శ్రీనగర్‌కు వచ్చే పర్యటకుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Updated : 22 Aug 2021 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  దాల్‌ సరస్సులో తేలియాడే ఏటీఎంను ఏర్పాటు చేసింది. శ్రీనగర్‌కు వచ్చే పర్యటకుల సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆగస్టు 16న ఎస్‌బీఐ ఛైర్మన్‌ దనీష్‌ కహరా దీనిని ప్రారంభించారు. ‘‘దాల్‌ సరస్సులోని హౌస్‌బోట్‌లో ఎస్‌బీఐ తేలియాడే ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఎప్పటి నుంచో ఉన్న ఇక్కడి ప్రజల కోరిక నేడు తీరింది. ఇది శ్రీనగర్‌కు అదనపు ఆకర్షణ కానుంది’’అని ఎస్‌బీఐ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

కొచ్చిలో తొలి ఏటీఎం..

భారత్‌లోనే తేలియాడే ఏటీఎంను తొలిసారిగా కొచ్చిలో 2004లో ఏర్పాటు చేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే ఈ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎంను ఒక ఫెర్రీపై ఏర్పాటు చేశారు. ఈ ఫెర్రీ కేరళ షిప్పింగ్‌ అండ్‌ ఇండియన్‌ నేవిగేషన్‌ కార్పొరేషన్‌ది. ఇది ఎర్నాకుళం- వ్యాపిన్‌ మధ్య తిరుగుతుంటుంది. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే ఏటీఎం అని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు