ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కం 2006 లో ప్రారంభ‌మైంది. భార‌త పౌరులు పాన్ నంబ‌ర్‌తో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. ఈ ఖాతా ద్వారా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌ గురించి…

Updated : 02 Jan 2021 19:15 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కం 2006 లో ప్రారంభ‌మైంది. భార‌త పౌరులు పాన్ నంబ‌ర్‌తో ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. ఈ ఖాతా ద్వారా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.
ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్‌ గురించి…

  1. ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్స్ ఖాతాలో క‌నీసం రూ.1000 నుంచి గ‌రిష్ఠంగా ఏడాదికి రూ.1,50,000 వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
  2. ఈ ఖాతా క‌నీస‌ కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. ప‌దేళ్ల‌వ‌ర‌కి కూడా కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది.
  3. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల మాదిరిగానే దీనిపై వ‌డ్డీ ల‌భిస్తుంది.
  4. ఐదేళ్ల‌కి ముందే ఖాతాను ఉప‌సంహ‌రించుకునేందుకు వీల్లేదు.
  5. ఈ ఖాతాకు నామినీ స‌దుపాయం కూడా ఉంది.

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్, రిక‌రింగ్ డిపాజిట్ల‌తో పాటు ఫ్లెక్లీ డిపాజిట్ స్కీముల‌ను కూడా అందిస్తుంది. ఇందులో ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా డ‌బ్బు డిపాజిట్ చేసే అవ‌కాశం గ‌రిష్ఠ ప‌రిమితి వ‌ర‌కు డిపాజిట్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.5 వేల నుంచి ఏడాదికి రూ.50 వేల వ‌ర‌కు జ‌మ చేయ‌వ‌చ్చు. క‌నీస కాల‌ప‌రిమితి ఐదేళ్లు. గ‌రిష్ఠంగా ఏడేళ్ల వ‌ర‌కు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని