ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఖాతాను వేరే శాఖ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డం ఎలా?

మీరు ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి మారాల్సి వ‌స్తే… మీ బ్యాంకు ఖాతాను కూడా మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న శాఖ‌కు మార్చుకోవాల‌నుకుంటున్నారా. అది చాలా సుల‌భం. ఆన్‌లైన్‌లో సుల‌భంగా మీ ఖాతాను మీకు న‌చ్చిన శాఖ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే గ‌తంలో దీనికోసం ఒక ఫారం నింపి, ఎందుకు బ‌దిలీ చేసుకోవాల‌నుకుంటున్నారో కార‌ణం తెలియ‌జేయాల్సి..

Updated : 01 Jan 2021 19:45 IST

మీరు ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి మారాల్సి వ‌స్తే… మీ బ్యాంకు ఖాతాను కూడా మీకు ద‌గ్గ‌ర‌లో ఉన్న శాఖ‌కు మార్చుకోవాల‌నుకుంటున్నారా. అది చాలా సుల‌భం. ఆన్‌లైన్‌లో సుల‌భంగా మీ ఖాతాను మీకు న‌చ్చిన శాఖ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అయితే గ‌తంలో దీనికోసం ఒక ఫారం నింపి, ఎందుకు బ‌దిలీ చేసుకోవాల‌నుకుంటున్నారో కార‌ణం తెలియ‌జేయాల్సి ఉండేది. దీంతో పాటు దృవీక‌ర‌ణ ప‌త్రాలు కూడా అవ‌స‌రం అయ్యేవి. దీంతో చాలావ‌ర‌కు వినియోగ‌దారులు ఖాతాను బ‌దిలీ చేసుకోకుండా అలానే కొన‌సాగించ‌డం, వాయిదా వేయ‌డం వంటివి చేసేవారు. ఇప్పుడు ఈ విధానం సుల‌భంగా మారింది.
సుల‌భంగా ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఖాతాను ఎలా బ‌దిలీ చేసుకోవాలో తెలుసుకుందాం…

  1. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి ‘www.onlinesbi.com’ యూజ‌ర్‌నేమ్, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ కావాలి
  2. ‘personal banking’ ఆప్ష‌న్ ఎంచుకోవాలి.
  3. ‘e-services’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
  4. ‘Transfer of savings account’ ఆప్ష‌న్ ఎంచుకోవాలి
  5. మీరు ఖాతాను ఎక్క‌డికి బ‌దిలీ చేసుకోవాలానుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖ‌ను ఎంచుకోవాలి
  6. బ‌దిలీ చేసుకునే బ్యాంకు కోడ్‌ను ఎంట‌ర్‌చేయాలి. అక్క‌డ ఇచ్చిన నియ‌మ, నిబంధ‌న‌ల‌ను చ‌దివిన త‌ర్వాత స‌బ్‌మిట్ చేయాలి
  7. ప్ర‌స్తుత బ్యాంక్‌ కోడ్, క్రొత్త బ్రాంచ్ కోడ్ వంటి మీ అన్ని ఖాతా బదిలీ వివరాలను ధృవీకరించుకోవాలి. ‘Confirm’. పై క్లిక్ చేయాలి.
  8. త‌ర్వాత మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపి వ‌స్తుంది.
  9. ఓటీపీ ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయాలి
  10. 'Your branch transfer request has been successfully registeredస అనే స‌మాచారం మీకు క‌నిపిస్తుంది.
    మీ ఖాతాకు కేవైసీ పూర్తిచేస్తేనే ఆన్‌లైన్‌లో ఖాతా బ‌దిలీ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. మొబైల్ నంబ‌ర్ కూడా బ్యాంకు ఖాతాకు అనుసంద‌ధానం చేసి ఉండాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని