గృహ రుణాలపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బీఐ 

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో

Published : 05 Apr 2021 14:02 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో తాజా రుణరేటు 6.95శాతంగా ఉంది. పెంచిన రేట్లు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఎస్‌బీఐ మార్చి 1న ఇంటి రుణాలపై వడ్డీరేట్లను అత్యంత కనిష్ఠంగా 6.70శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజుపైనా వంద శాతం రాయితీ కల్పించింది. అయితే ఆ పరిమిత ఆఫర్‌ మార్చి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు గతంలోనే పేర్కొంది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి నూతన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. తాజాగా ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీరేట్లు 6.95శాతంగా ఉన్నాయి. మరోవైపు గృహరుణాలపై 0.40శాతం ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ కూడా ఉండనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. రుణాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 10వేల నుంచి రూ. 30వేల వరకు ఉండనుంది. ఇదిలా ఉండగా.. ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో మిగతా బ్యాంకులు కూడా ఇదే నిర్ణయాన్ని అనుసరించే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని