SBI-IMPS: ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచిన ఎస్‌బీఐ.. ఛార్జీలు ఇలా..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఐఎంపీఎస్‌ (ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది.

Published : 03 Jan 2022 21:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఐఎంపీఎస్‌ (ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో గరిష్ఠంగా రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గతేడాది అక్టోబర్‌లో సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

24×7 ఎప్పుడైనా నగదు పంపుకొనేందుకు IMPS సాయపడుతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో సైతం నగదు పంపుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు రూ.2+జీఎస్టీ; రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు రూ.4+ జీఎస్టీ; లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు రూ.12+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబ్‌ను ఎస్‌బీఐ ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని