ఇక‌పై వాచీతో బిల్లు చెల్లించ‌వ‌చ్చు

యోనో యాప్‌ ఆధారంగా పనిచేసే టైటన్‌ చెల్లింపు వాచీల (పేమెంట్‌ వాచెస్‌) శ్రేణిని ఎస్‌బీఐ, టైటన్‌లు ఆవిష్కరించాయి. డెబిట్‌ కార్డు స్వైపింగ్‌ అవసరం లేకుండానే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌)ల పైన వాచీని ఉంచి చెల్లింపులు పూర్తి చేయొచ్చని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్లు..

Updated : 01 Jan 2021 19:33 IST

యోనో యాప్‌ ఆధారంగా పనిచేసే టైటన్‌ చెల్లింపు వాచీల (పేమెంట్‌ వాచెస్‌) శ్రేణిని ఎస్‌బీఐ, టైటన్‌లు ఆవిష్కరించాయి. డెబిట్‌ కార్డు స్వైపింగ్‌ అవసరం లేకుండానే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌)ల పైన వాచీని ఉంచి చెల్లింపులు పూర్తి చేయొచ్చని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్లు ఈ సౌలభ్యం పొందాలంటే యోనో యాప్‌లో నమోదై ఉండాలి. ప్రస్తుతం యోనోకు 2.6 కోట్ల మంది నమోదిత వినియోగదార్లు ఉన్నారు. పిన్‌ నెంబరు కొట్టకుండానే రూ.2000 వరకు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.

వాచ్ పట్టీలో పొందుపరిచిన ధృవీకరించిన సుర‌క్షిత నియ‌ర్‌ -ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) చిప్ బ్యాంకు ప్రామాణిక కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డుకు సంబంధించిన‌ అన్ని కార్యాచరణలను అనుమతిస్తుంది. ఈ గడియారాలలో చెల్లింపు విధానం దేశంలో 2 మిలియన్లకు పైగా కాంటాక్ట్‌లెస్ మాస్టర్ కార్డ్ అనుమ‌తించే పీఓఎస్‌ యంత్రాలలో అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని