SBI E- Auction: 25న ఎస్‌బీఐ మెగా ఇ-వేలం.. ఎలా పాల్గొనాలంటే..?

వేలం కోసం ఉంచ‌బ‌డిన ఆస్తుల వివ‌రాల‌ను  సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్ర‌కట‌న‌లో అందించిన లింక్‌ల ద్వారా యాక్సిస్ చేయ‌వ‌చ్చు.

Updated : 17 Oct 2021 21:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త‌న‌ఖా పెట్టిన ప‌లు వాణిజ్య‌, నివాస ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇ-వేలం వేయ‌నుంది. ఈ మెగా వేలం అక్టోబ‌రు 25 నిర్వ‌హించ‌నుంది. ఎస్‌బీఐ మెగా ఇ-వేలం ద్వారా మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ‌కే ఇల్లు, ఫ్లాట్లు, షాపుల‌ను బిడ్ వేసి గెలుచుకునే అవ‌కాశం ఉంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయాల‌నుకునే వారు ఇ-వేలంలో జాయిన్ అయ్యి బిడ్ వేయొచ్చని ఎస్‌బీఐ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

‘‘బ్యాంకు వ‌ద్ద తాక‌ట్టు పెట్టి అప్పు చెల్లించ‌లేని వారి ఆస్తుల‌ను ఇ-వేలం ద్వారా పార‌ద‌ర్శంగా విక్ర‌యిస్తున్నాం. వేలం వేసే ఆస్తుల‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో పాటు కావాల్సిన అన్ని పత్రాలు, వివరాలు బిడ్డ‌ర్ల‌కు అందజేస్తాం’’ అని బ్యాంక్‌ తెలిపింది. వేలం కోసం ఉంచిన ఆస్తుల వివ‌రాల‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్ర‌కట‌న‌లో అందించిన లింక్‌ల ద్వారా యాక్సెస్‌ చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు వేలం వేసే విధానం, అత‌డు/ ఆమె కొనుగోలు చేయాల‌నుకునే ఆస్తి గురించి సందేహాల నివృత్తి కోసం సంబంధిత బ్రాంచ్‌ల‌ను సంప్ర‌దించొచ్చు.

ఎస్‌బీఐ ఇ-వేలంలో పాల్గొనడానికి ఏం కావాలి..?
1.
ఇ-వేలం నోటీసులో పేర్కొన్న నిర్దిష్ట ఆస్తి కోసం ఈఎండీ.

2. కేవైసీ ప‌త్రాలు.. సంబంధిత ఎస్‌బీఐ శాఖకు సమర్పించాలి.

3. చెల్లుబాటు అయ్యే డిజిట‌ల్ సంత‌కం.. బిడ్డర్లు ఇ-వేలం వేసేవారిని గానీ, మ‌రి ఏ ఇతర అధికారిక ఏజెన్సీని గానీ సంప్ర‌దించి డిజిటల్ సంతకం పొందొచ్చు.

4. ఒక‌సారి బిడ్డ‌ర్ ఈఎండీ డిపాజిట్ చేసి, కేవైసీ ప‌త్రాల‌ను సంబంధిత శాఖ‌కు స‌మ‌ర్పించిన త‌ర్వాత‌.. ఇ-వేలం వేసే వారు బిడ్డ‌ర్ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.

5. వేలం నిబంధ‌న‌ల ప్ర‌కార‌లం బిడ్డ‌ర్లు ఇ-వేలం తేదీన‌, చెప్పిన స‌మ‌యంలో లాగిన్ అయ్యి వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.

బిడ్డింగ్‌లో ఎలా పాల్గొనాలి..
1. ఇ-వేలం వేసే వారు ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి ఇ-వేలం తేదీన, స‌మ‌యానికి పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

2. నియ‌మ నిబంధ‌న‌లు, ష‌ర‌తున‌లను అంగీక‌రిస్తున్న‌ట్లు తెలిపి, ‘పార్టిసిపేట్’ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

3. పార్టిసిపేట్ పై క్లిక్ చేసిన త‌ర్వాత కేవైసీ ప‌త్రాలు, ఈఎండీ వివ‌రాలు, ఎఫ్ఆర్‌క్యూ (ఫ‌స్ట్ రేట్ కొటేష‌న్‌) వివ‌రాలు అప్‌లోడ్ చేయాలి.

4. అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాలు అప్‌లోడ్ చేసిన త‌ర్వాత కోటేష‌న్‌ను స‌మ‌ర్పించాలి. ఈ కొటేష‌న్‌లో వేసిన ఆస్తి ధ‌ర రిజ‌ర్వుడ్ విలువ‌తో స‌మానంగా గానీ అంత‌కంటే ఎక్కువ గానీ ఉండాలి.

5. కోట్ చేసిన ధరను ఫిల్ చేసిన‌ తర్వాత ‘సబ్మిట్’పై క్లిక్ చేసి, ఆపై ‘ఫైనల్ సబ్మిట్’పై క్లిక్ చేయాలి. ఫైనల్ స‌బ్మిష‌న్ తర్వాత బిడ్డర్ అప్‌లోడ్ చేసిన ప‌త్రాలలో గానీ కోట్ చేసిన ధరలో గానీ మార్పులు చేయలేరని గమనించాలి.

6. నిర్ణీత తేదీ, సమయం లోపల ‘ఫైనల్ సబ్మిట్’ చేయ‌డంలో విఫలమైతే, బిడ్డర్లు వేలంలో పాల్గొనలేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని