పిల్ల‌ల కోసం ఎస్‌బీఐ పెహ్లా క‌ద‌‌మ్‌, పెహ్లీ ఉడాన్ పొదుపు ఖాతాలు

ఈ ఖాతాలు మీ చిన్న పిల్లలను మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి.........

Updated : 01 Jan 2021 16:54 IST

ఈ ఖాతాలు మీ చిన్న పిల్లలను మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి.

దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్య‌క‌తిగ‌త బ్యాంకింగ్ సేవ‌ల విభాగంలో పెహ్ల క‌ద‌మ్‌ అండ్ పెహ్లీ ఉడాన్ అనే రెండు ర‌కాల పొదుపు ఖాతాలు మైన‌ర్ పిల్ల‌ల కోసం ప్రారంభించిన‌ట్లు తెలిపింది. ఈ ఖాతాలు మీ చిన్న పిల్లలను మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి, అంతేకాకుండా డబ్బును త్వరగా ఆదా చేసే అలవాటును పెంచుతాయి. పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ పొదుపు ఖాతాకు సంబంధించిన‌ కొన్ని ప్రయోజనాలను పరిశీలిద్దాం.

ఎస్‌బీఐ పెహ్లా కదమ్ ఖాతా:

  1. మైన‌ర్ పిల్ల‌లు ఏ వ‌య‌సులోనైనా ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. కానీ ఈ ఖాతా త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుడితో క‌లిపి ఉమ్మ‌డి ఖాతాగా ప్రారంభించాలి.
  2. ఎస్‌బీఐ పెహ్ల క‌ద‌మ్ ఖాతా లావాదేవీల విలువ ఇంటెర్నెట్ బ్యాంకింగ్‌తో అయితే రోజుకు రూ.5000 వ‌ర‌కే ప‌రిమితి ఉంది. అదే మొబైల్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.2000
  3. ఎస్‌బీఐ పెహ్ల క‌ద‌మ్ వ‌డ్డీ రేటు, ఎస్‌బీఐ పొదుపు ఖాతాకు స‌మానంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఎస్‌బీఐ ల‌క్ష రూపాయ‌ల కంటే త‌క్కువ డిపాజిట్ల‌పై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  4. ఈ ఖాతాపై పిల్ల‌ల ఫోటో క‌లిగిన ఏటీఎం-క‌మ్-డెబిట్ కార్డును మైన‌ర్‌తో పాటు త‌ల్లిదండ్రుల పేరుతో జారీచేస్తారు. ఏటీఎం లేదా పీఓఎస్ వ‌ద్ద రూ.5000 వ‌ర‌కు లావాదేవీలు చేయ‌వ‌చ్చు.
  5. ప‌ర్స‌న‌ల్ చెక్‌బుక్ (10 చెక్కుల‌తో క‌లిగిన‌) సంర‌క్ష‌కుడికి మైన‌ర్ పిల్ల‌ల పేరుతో జారీచేస్తారు.

ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ ఖాతా:

  1. ఈ ఖాతాను కేవ‌లం మైన‌ర్ పిల్ల‌ల పేరుతో ప్రారంభించ‌వ‌చ్చు. అయితే వారి వ‌య‌సు 10 ఏళ్ల‌కు ఎక్కువ‌గా ఉండాలి
  2. ఈ ఖాతా ప‌రిమితి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.5000, మొబైల్ బ్యాంకింగ్‌తో అయితే రోజ‌కు రూ.2000 వ‌ర‌కు లావాదేవీల ప‌రిమితి ఉంది.
  3. వ‌డ్డీ రేట్లు ఎస్‌బీఐ పొదుపు ఖాతా మాదిరిగానే ఉంటుంది.
  4. ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ ఖాతాపై పిల్ల‌ల ఫోటో క‌లిగిన ఏటీఎం-క‌మ్‌-డెబిట్ కార్డును రూ.5000 లావాదేవీల ప‌రిమితితో పిల్ల‌ల పేరిట జారీచేస్తారు.
  5. వ్య‌క్తిగ‌త చెక్‌బుక్ (10 చెక్కుల‌తో క‌లిగిన‌) పిల్ల‌ల పేరుతో జారీచేస్తారు.

గ‌త‌వారంలో ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ న్యూ ఫండ్ (ఎన్ఎఫ్ఓ) ఆఫ‌ర్ ఎస్‌బీఐ చిల్ర్డ‌న్ బెనిఫిట్ ఫండ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది పిల్ల‌ల కోసం పెట్టుబడులు చేయాల‌నుకుంటున్న త‌ల్లిదండ్రుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. 1 నుంచి 14 వ‌య‌సు గ‌ల పిల్ల‌ల‌కు ఇది స‌రైన ఎంపిక‌. సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు దీనికోసం స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని