భారత్‌లో టీకా తయారీకి అమెరికా చట్టం అడ్డుపుల్ల!

వ్యాక్సిన్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు.........

Published : 16 Apr 2021 20:03 IST

అమెరికా అధ్యక్షుడికి లేఖ రాసిన అదర్ ‌పూనావాలా

ముంబయి: వ్యాక్సిన్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలంటే నిషేధం ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభవృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను భారత్‌లో ఎస్‌ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకు కూడా సీరం టీకాల్ని ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే.

‘‘ముడి పదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుణ్ని కోరుతున్నాను. ఫలితంగా టీకా ఉత్పత్తిని వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మీ పాలకవర్గం దగ్గర ఉన్నాయి. కరోనాను అంతం చేయడంలో మనమంతా కలిసి ముందుకు సాగాలంటే నిషేధం ఎత్తివేయక తప్పదు’’ అంటూ పూనావాలా ట్వీట్‌ చేశారు. ఈ సందేశానికి అమెరికా అధ్యక్షుడి ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు.

ముడి పదార్థాల సమస్యను పూనావాలా గత నెల జరిగిన ఓ సమావేశంలోనే ప్రస్తావించారు. అమెరికాలో ‘రక్షణ చట్టం’ అమల్లో ఉండడం వల్ల ఆ దేశంలో టీకాల తయారీకి కావాల్సిన కొన్ని ముడిపదార్థాలపై నిషేధం కొనసాగుతోంది. దీంతో అది ఇక్కడ టీకా తయారీకి పెద్ద అడ్డంకిగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని