సిప్‌తో కోటీశ్వ‌రులు కావొచ్చ

ఈఎల్ఎస్ఎస్‌లో దీర్ఘ‌కాలీక సిప్ పెట్టుబ‌డులు సామాన్యుల‌ను కోటీశ్వరుల‌ను చేస్తాయి.​​​​​​....

Published : 19 Dec 2020 13:12 IST

ఈఎల్ఎస్ఎస్‌లో దీర్ఘ‌కాలీక సిప్ పెట్టుబ‌డులు సామాన్యుల‌ను కోటీశ్వరుల‌ను చేస్తాయి.​​​​​​​

పెట్టుబ‌డుల‌కు స‌రైన ప్ర‌ణాళిక ఏంటి? ఎందులో పెట్టుబ‌డులు పెడితే ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుంటే క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా త‌గిన ప్ర‌తిఫలితం పొంద‌వ‌చ్చు. మార్కెట్లో మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి చాలా ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డికి ప‌న్ను వ‌ర్తిస్తుంది. మ‌దుప‌ర్లు ఎందులో ప‌న్ను మిన‌హాయింపు క‌లిగి, ఎక్కువ రాబ‌డి వ‌చ్చే వీలుంటుందో తెలుపుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాలు ఈ కోవ‌కు చెందిన‌వేన‌ని చెప్పాలి. ఎందుకంటే ఇవి మార్కెట్ సంబంధిత సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. ఈఎల్ఎస్ఎస్‌లో రూ.500 నుంచి పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. గ‌రిష్ఠంగా రూ.1.5ల‌క్ష‌ల వర‌కు ప‌రిమితి ఉంది. ఈఎల్ఎస్ఎస్‌ లో గ్రోత్, డివిడెండ్ రెండు ర‌కాల పెట్టుబ‌డులు ఉంటాయి. డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకున్నట్ల‌యితే లాక్‌-ఇన్ పీరియ‌డ్ మూడేళ్ల కాలంలో డివిడెండును కొంత‌ మొత్తాన్ని వాయిదా రూపంలో చెల్లిస్తారు. గ్రోత్ ఆప్ష‌న్ ఎంచుకుంటే లాక్‌-ఇన్ పీరియ‌డ్ ముగిసిన త‌ర్వాత లేదా పెట్టుబ‌డులు ఉప‌సంహరించుకున్న తర్వాత‌ మొత్తం రాబ‌డి ఒకేసారి ఇస్తారు.

దీంతో పాటు ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌కు వ్య‌యాలు కూడా త‌క్కువే. సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెడితే క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు కావ‌డంతో పాటు సుల‌భంగా పెట్టుబ‌డులు కొన‌సాగించ‌వ‌చ్చు. అంటే ప్ర‌తి నెల మీ సిప్ ఖాతాలో జ‌మ‌చేయాల్సిన ప‌నిలేకుండా మీ బ్యాంకు ఖాతాకు జ‌త‌చేస్తే ఈఎల్ఎస్ఎస్‌లో డిపాజిట్ అవుతాయి.

ఇత‌ర పెట్టుబ‌డులతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్‌లో లాక్-ఇన్ పీరియ‌డ్ కూడా త‌క్కువ‌గానే 3 సంవ‌త్స‌రాలు ఉంటుంది. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో లాక్‌-ఇన్ పీరియ‌డ్ 5 సంవ‌త్స‌రాలు, పీపీఎఫ్ 15 సంవ‌త్స‌రాలు, ఎన్ఎస్సీ 5 సంవ‌త్స‌రాలు. జాతీయ పెన్ష‌న్ ప‌థకం ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ఉంటుంది. సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం, ఈఎల్ఎస్ఎస్‌పై రూ.1.5 లక్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. దీంతో పాటు ఇందులో అద‌నంగా క్యాపిట‌ల్ గ్రోత్ బెనిఫిట్ కూడా ఉంటుంది.

ఇత‌ర‌వాటితో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ ఎందుకు మేలైన‌దో చూద్దాం…

పెట్టుబ‌డులు ప్రారంభించేముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎక్కువ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే అంత ఎక్కువ‌గా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవి ఈక్విటీ ప‌థ‌కాలైన, ఇత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలైనా ఇదే వ‌ర్తిస్తుంది.

  • దేశంలో ఎఫ్‌డీ, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ వంటి చాలా ర‌కాల పెట్టుబ‌డుల సాధ‌నాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై ప‌న్ను ఉంటుంది. కానీ ఈఎల్ఎస్ఎస్ ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌టం ప్ర‌యోజ‌న‌క‌రం.
  • క్లియ‌ర్ ట్యాక్స్ నివేదిక ప్ర‌కారం, 5 సంవ‌త్స‌రాల బ్యాంక్ డిపాజిట్ 5 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్‌తో 6-7% వ‌ర‌కు లాభాల‌ను ఇస్తుంది.
  • పీపీఎఫ్ ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటంటే, వీటి ద్వారా ఎఫ్‌డీ కంటే ఎక్కువ‌గా రాబ‌డినందిస్తుంది. పీపీఎఫ్ లో15 సంవ‌త్స‌రాల లాక్-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే దీనిపై ప‌న్ను మిన‌హాయింపులు వ‌ర్తిస్తాయి. నీ దీనికి 15 సంవ‌త్స‌రాల లాక్-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే దీనిపై ప‌న్ను మిన‌హాయింపులు వ‌ర్తిస్తాయి.
  • జాతీయ పొదుపు ప‌త్రాలు, జాతీయ పింఛ‌ను ప‌థ‌కం 7-8 శాతం, 8-10 శ‌తం ఐదేళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఎన్ఎస్‌సీ ప‌థ‌కంపై రాబ‌డిపై ఆదాయ‌ప‌న్ను ఉంటుంది.
  • ఈ స్కీముల‌తో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ క‌నీసం 10 నుంచి 18 శాతం వ‌ర‌కు రాబ‌డినిస్తుంది. 3 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఒక్కోసారి 18 శాతం కంటే ఎక్కువ కూడా రాడి వ‌చ్చే అవ‌కాశముంటుంది.
  • ఈఎల్ఎస్ఎస్‌లో నెల‌కు రూ.500 సిప్ చేస్తే 20 సంవ‌త్స‌రాల‌కు మొత్తం పెట్టుబ‌డులు రూ.1.20 లక్ష‌ల‌కు చేరతాయి. రాబ‌డి 15 నుంచి 18 శాతం వ‌ర‌కు ఉంటుంది. రాబ‌డితో క‌లిపి రూ7.48 లక్ష‌ల నుంచి రూ.11.54 లక్ష‌ల వ‌ర‌కు ల‌భిస్తుంది.
  • అదే నెల‌కు రూ.1000 పెట్టుబ‌డిగా పెట్టాల‌నుకుంటే 20 ఏళ్ల‌కి మొత్తం పెట్టుబ‌డి రూ.2.40 లక్ష‌లు అవుతుంది. రాబ‌డి 15-18 శాతంగా అంచ‌నా వేస్తే రూ.14.97 లక్ష‌లు నుంచి రూ.23.08 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది.
  • రూ.5000 అయితే -20 సంవ‌త్స‌రాల‌కు మొత్తం పెట్టుబ‌డులు రూ.12 ల‌క్ష‌లు- రాబ‌డి రూ.1.15 కోట్లు
  • చివ‌ర‌గా నెల‌కు రూ.10 వేల పెట్టుబ‌డులు అయితే 20 సంవ‌త్స‌రాల‌కు రూ.24 ల‌క్ష‌లు- రాబ‌డి రూ.2.31 కోట్లు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని