పెట్టుబ‌డులు ఒకేసారి లేదా సిప్ రూపంలో..ఏది మేలు?

మార్కెట్ల‌ గురించి అవ‌గాహ‌న ఉన్న‌వారు, త‌రచుగా మార్కెట్ల‌ను అనుస‌రిస్తున్న‌వారు అధిక పెట్టుబడి పధకాలను ఎంచుకోవ‌చ్చు....

Published : 21 Dec 2020 13:11 IST

మార్కెట్ల‌ గురించి అవ‌గాహ‌న ఉన్న‌వారు, త‌రచుగా మార్కెట్ల‌ను అనుస‌రిస్తున్న‌వారు అధిక పెట్టుబడి పధకాలను ఎంచుకోవ‌చ్చు

8 నవంబర్ 2018 మధ్యాహ్నం 12:44

పెట్టుబ‌డులు ఒకేసారి పెద్ద మొత్తంలో (లంప్‌స‌మ్‌) పెట్టాలా ? లేదా సిప్ ప‌ద్ధ‌తిలో ప్ర‌తి నెలా కొంత క‌చ్చిత‌మైన మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మంచిదా? అన్న‌ది చాలామందికి సందేహం. అయితే గ‌త మూడేళ్లుగా చూస్తే సిప్ పెట్టుబ‌డుల‌తో పోలిస్తే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టిన‌వారికి 5 నుంచి 10 శాతం అధిక రాబ‌డి పొందారు. ఆర్థిక నిపుణులు ఎప్పుడు సిప్ పెట్టుబ‌డులు మేల‌ని సూచిస్తారు. అయితే అన్నిసార్లు ఇంందులో లాభాలు రాక‌పోవ‌చ్చు. ఒక్కోసారి లంప్‌స‌మ్ పెట్టుబ‌డుల‌కు లాభాలు అధికంగా ఉండొచ్చు. సిప్ పెట్టుబ‌డులు వ్య‌యాలు, రాబ‌డి వంటి చాలా విష‌యాల్లో ఉప‌శ‌మ‌నం క‌లిగించిన‌ప్ప‌టికీ లాభాల విష‌యంలో క‌చ్చిత‌మైన హామీని ఇవ్వ‌లేవు. గ‌తేడాది 97 శాతం ఈక్విటీ ఫండ్ల‌లో పెద్ద‌మొత్తాల పెట్టుబ‌డుల‌తో పోలిస్తే సిప్ త‌క్కువ రిట‌ర్నుల‌ను ఇచ్చాయి. అయితే ఇందుకు కార‌ణాలేంటి భవిష్య‌త్తులో కూడా ఇదేవిధంగా ఉంటాయా, తెలుసుకుందాం.

సిప్ గురించి:

దేశంలో చాలామంది ఇప్పుడు సిప్ పెట్టుబ‌డుల‌కు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. సిప్‌లో ఉన్న ప్ర‌యోజ‌నాల‌తో అంద‌రూ అటువైపు మొగ్గుచూపుతున్నారు. త‌క్కువ మొత్తంలో కొంచెం కొంచెంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌తంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. క‌నిష్ఠంగా రూ.500 తో కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. అదే నేరుగా ఒక కంపెనీ షేరును కొనుగోలు చేసేందుకు అది వీలుకాక‌పోవ‌చ్చు. అదేవిధంగా సిప్‌లో త‌క్కువ డ‌బ్బుతో ఎక్కువ యూనిట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. సిప్‌తో పెట్టుబ‌డులు అల‌వాటుగా మార‌తాయి. అందుకే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి సిప్ ద్వారా నెల‌కు కూ.7 వేల కోట్ల నిధులు వ‌స్తున్నాయి.

ఎవ‌రైతే రెగ్యుల‌ర్‌గా మార్కెట్‌ను ప‌రిశీలిస్తుంటారో, అన‌స‌రిస్తుంటారో వారు ఒక అంచనాతో లంప్‌స‌మ్‌ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మిగులు నిధుల‌ను పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగించాల‌నుకునేవారు ఈ విధానాన్ని ఎంచుకోవ‌చ్చు. మార్కెట్ల గురించి అవ‌గాహ‌న లేనివారికి మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా సిప్ పెట్టుబ‌డులే స‌రైన‌వి.

సిప్ లాభాల కోసం కాదు పొదుపు కోసం:

సిప్ రిట‌ర్నుల‌తో పోలిస్తే లంస్‌స‌మ్‌ పెట్టుబ‌డుల‌తో లాభం ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు. మూడేళ్లుగా సిప్‌లో పెట్టుబ‌డులు చేస్తున్న‌వారు ఎలాంటి మార్పు లేకుండా అదే రాబ‌డిని చూస్తుండ‌వ‌చ్చు. అయితే సిప్‌ని ఒక పెట్టుబ‌డి సాధ‌నంగా , రాబ‌డిని ఆశించే విధంగా కాకుండా డ‌బ్బును పొదుపు చేసేందుకు సిప్ విధానాన్ని అనుస‌రించాలి. మార్కెట్లు పెరిగిన‌ప్పుడు అధిక పెట్టుబ‌డులు అధిక రాబ‌డిని అందిస్తాయి. సిప్‌లో క్ర‌మానుగ‌తంగా పెట్టుబ‌డులు ఉంటే, లంప్‌స‌మ్‌లో ఒకేసారి అధిక మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టాలి. మార్కెట్లు లాభాల్లో ఉన్న‌ప్పుడు లంప‌స్‌మ్ పెట్టుబ‌డికి ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. ఈ పెట్టుబ‌డుల‌పై గ‌త ఐదేళ్లుగా లాభాలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి.

సిప్‌ను కొన‌సాగించండి:

సిప్ అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు స‌రైన‌ద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. అంటే క‌నీసం 7 నుంచి 10 సంవ‌త్స‌రాలు సిప్‌ను కొన‌సాగించాలి. గ‌త 15 ఏళ్లుగా సిప్‌లు స‌గ‌టుగా 20 శాతం అంత‌గ్గ‌త రాబ‌డి రేటును క‌న‌బ‌రుస్తున్నాయి. సిప్ ఎక్కువ‌కాలం కొన‌సాగిస్తే మార్కెట్ ఒడ‌దొడుకుల‌ను త‌ట్టుకొని త‌గిన‌ రాబ‌డిని అందిస్తాయి. సిప్‌లు త‌క్కువ ఆస్తుల విలువ క‌లిగిన ఎక్కువ యూనిట్ల‌ను కొనుగోలు చేస్తాయి. దీంతో పెట్టుబ‌డుల వ్య‌యం త‌గ్గుతుంది, రాబడులు పెరుగుతాయి. మార్కెట్ల‌తో సంబంధం లేకుండా పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని