Cairn: కెయిర్న్‌ షేర్ల విక్రయమే కొంప ముంచిందా? 

బ్రిటన్‌ సంస్థ కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కోసం,

Published : 09 Aug 2021 15:44 IST

అందువల్లే అంతర్జాతీయ ఒత్తిడి: పన్ను నిపుణులు 

దిల్లీ: బ్రిటన్‌ సంస్థ కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు కోసం, వివిధ దేశాల్లో ఆ సంస్థ కోర్టుల్లో వేస్తున్న కేసుల ఫలితంగా భారత ప్రభుత్వ ఆస్తులను సీజ్‌ చేసే ముప్పు ఎదురవుతోంది. ఈ కేసునకు కారణమైన ‘వెనకటి తేదీ నుంచి విధించే పన్ను (రెట్రోస్పెక్టివ్‌ పన్ను) విధానాన్ని’ భారత ప్రభుత్వం తాజాగా రద్దు చేయడమే కాక, సంబంధిత బిల్లుకు లోక్‌సభ ఆమోదం పొందింది కూడా. కెయిర్న్‌ వివాదంలో ఆ సంస్థ షేర్లను భారత ప్రభుత్వం విక్రయించకుండా ఉంటే, అంతర్జాతీయ ఒత్తిడి తప్పేదని పన్ను, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2012 నాటి రెట్రోస్పెక్టివ్‌ పన్ను చట్టాన్ని వినియోగించి వొడాఫోన్‌ సహా 17 సంస్థలపై మొత్తం రూ.1.10 లక్షల కోట్ల పన్ను విధించినా, కెయిర్న్‌ కేసులో మాత్రమే అధికంగా వసూలు చేశారు. ఆ సంస్థ నుంచి రూ.10,247 కోట్ల పన్ను బకాయిలు రాబట్టుకునేందుకు కెయిర్న్‌ భారత అనుబంధ సంస్థలో 10 శాతం వాటా విక్రయించడం, రూ.1140 కోట్ల డివిడెండు జప్తు చేయడం, రూ.1590 కోట్ల పన్ను రిఫండ్‌లను నిలిపివేయడం వంటి చర్యలను ఆదాయపు పన్ను సంస్థ చేపట్టింది. 2015 మార్చిలో పన్ను నోటీసు ఇచ్చిన రెండేళ్లలోనే ఎక్కువ శాతం షేర్లను విక్రయించినట్లు ఒక అగ్రగామి పన్ను నిపుణుడు వెల్లడించారు. అటాచ్‌ చేసిన షేర్లను కెయిర్న్‌ విక్రయించలేదన్న విషయాన్ని మరిచారని, ఇది కెయిర్న్‌కు న్యాయప్రక్రియల్లో బలం చేకూర్చిందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని