లంచం కేసులో శామ్‌సంగ్‌ వారసుడికి జైలు శిక్ష

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గం శామ్‌సంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌ సోమవారం తిరిగి జైలుకెళ్లారు. 2016 లంచం కుంభకోణంలో ఆయన పాత్ర నేపథ్యంలో రెండున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ దక్షిణ కొరియా కోర్టు ఒకటి తీర్పునిచ్చింది. అప్పట్లో ఈ కుంభకోణం కారణంగా భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగడంతో అప్పటి దేశాధ్యక్షులు పార్క్‌ జీన్‌ హే పదవిని సైతం కోల్పోయారు. శామ్‌సంగ్‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి 2015లో ప్రభుత్వం నుంచి మద్దతునివ్వడానికి పార్క్‌కు యాంగ్‌ లంచం ఇచ్చినట్లు కోర్టు విశ్వసించింది. ఈ తీర్పుపై శామ్‌సంగ్‌ నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. తిరిగి అప్పీలు చేస్తారో లేదో కూడా తెలియరాలేదు.
దేశీయంగా ఎయిర్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌
చెన్నై: దేశీయంగా కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేయనుండటంతో, ఇందుకు అనుగుణంగా తయారీ యూనిట్‌ ఏర్పాటవుతోంది. జపాన్‌కు చెందిన దైసెల్‌ కార్పొరేషన్‌ ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ఫ్లేటర్‌ తొలి తయారీ ప్లాంటును చెన్నై సమీపంలోని పారిశ్రామిక పార్కు వన్‌హబ్‌ చెన్నై ఆవరణలో నెలకొల్పుతోంది. తొలిదశలో రూ.230 కోట్ల పెట్టుబడి పెడతామని దైసెల్‌ కార్పొరేషన్‌ ఇండియా ఎండీ టకాసే యొషిఫుమి తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు థాయిలాండ్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వీటిని సరఫరా చేస్తున్నామని, దేశీయంగా పెరగనున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని, ఇక్కడే తయారీ చేపడుతున్నట్లు వివరించారు. 2023 డిసెంబరుకు ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ అంచనా వేస్తోంది.
విదేశీ మారకానికి ‘రత్నాభరణాల’ మద్దతు
* ఎగుమతులను ప్రోత్సహిస్తాం: మంత్రి

ముంబయి: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో భారత రత్నాభరణాల రంగం మెరుగైన పాత్ర పోషిస్తోందని వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి పేర్కొన్నారు. ఎగుమతులకు ప్రోత్సాహకాలివ్వాల్సిన రంగాల్లో ఇది కీలకమైనదిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు 100 శాతం పరిమితిని అనుమతించాం. ఏటా ఇపుడు 35 బిలియన్‌ డాలర్ల రత్నాభరణాలు ఎగుమతి అవుతున్నాయి. అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచామ’ని ఆయన వివరించారు. కొవిడ్‌ టీకాల రాకతో అన్ని ప్రధాన మార్కెట్ల నుంచి రత్నాభరణాలకు గిరాకీ ప్రారంభమైందన్నారు. డిజిటల్‌ మీడియా అనేది వ్యాపారాన్ని సరికొత్తగా చేయడం నేర్పుతోందని అయిదు రోజుల అంతర్జాతీయ రత్నాభరణాల ప్రదర్శన ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని