సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లు, వాటి వడ్డీ రేట్లు..
ఈ స్పెషల్ డిపాజిట్ల గడువు తేదిని జూన్ 30,2021 వరకు పొడిగిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి
కరోనా నేపథ్యంలో వేగంగా పడిపోతున్న వడ్డీ రేట్ల నుంచి సీనియర్ సిటిజన్లను పరిరక్షించేందుకు ప్రవేశపెట్టిన పథకమే సీనియర్ సిటిజన్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకం గడువు తేది మార్చి 30తో ముగియగా, జూన్ 30,2021 వరకు పొడిగిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా ఫిక్సడ్ డిపాజిట్లో ఇతరులకు ఆఫర్ చేసే వడ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా సీనియర్ సిటిజన్లకు ఇస్తుంటాయి బ్యాంకులు. అయితే స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లు అంతకంటే ఎక్కవ వడ్డీనే అందిస్తాయి. కొత్తగా చేసే డిపాజిట్లతో పాటు, పునరుద్ధరణ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.
ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా.. వంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అందించే స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లు వాటి వివరాలు...
ఎస్బీఐ ‘వుయ్‌కేర్ డిపాజిట్’..
గత సంవత్సరం మే నెలలో ‘Wecare’డిపాజిట్‌ను ప్రారంభించింది ఎస్బీఐ. దీని ద్వారా ఫిక్సడ్ డిపాజిట్లపై ఇతరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) మేర అదనపు వడ్డీని అందిస్తుంది. ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్లు చేసిన పెద్దలకు 6.20 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్..
సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే 75 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీరేటును హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలకు ఆఫర్ చేస్తుంది. ఈ స్పెషల్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ పెద్దలకు అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్..
ఫిక్సడ్ డిపాజిట్లపై ఇతరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) మేర అదనపు వడ్డీని అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిజిజన్ కేర్ ఎఫ్డీపై వార్షికంగా 6.30 శాతం వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
ఈ పథకం కింద సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇచ్చే వడ్డీ రేట్లతో పోలిస్తే, సీనియర్ సిటిజన్లకు 100 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో 5 సంవత్సరాలకు పైబడి, 10 సంవత్సరాలలోపు డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు 6.25శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తుంది.
ఇదీ చదవండి..
స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ పెద్దలకు లాభదాయకమేనా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!