భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 379 పాయింట్లు నష్టపోయి 48,800 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు పతనమై 14,437 వద్ద కొనసాగుతున్నాయి. ప్రివి స్పెషాలిటీ,

Published : 25 Mar 2021 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 379 పాయింట్లు నష్టపోయి 48,800 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు పతనమై 14,437 వద్ద కొనసాగుతున్నాయి. ప్రివి స్పెషాలిటీ, నిర్లోన్‌, జేబీ కెమికల్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ షేర్లు లాభాల్లో ఉండగా.. వాబ్కో, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 
నేడు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉండటం గమనార్హం. ఈ రోజు లక్ష్మీ ఆర్గానిక్స్‌, క్రాఫ్ట్‌మన్‌ ఆటోమేషన్‌ షేర్లు లిస్టింగ్‌ ‌కానున్నాయి. లక్ష్మీ ఆర్గానిక్స్‌ ఐపీవో 107 రెట్లు, క్రాఫ్ట్‌మన్‌ ఐపీవో 5.2 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. 

ఇవీ చదవండి

రికార్డు స్థాయిలో ద్రవ ఉక్కు ఉత్పత్తి

అదానీకి కోదాడ- ఖమ్మం రహదారి కాంట్రాక్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని