stock market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరిగి

Updated : 13 Jan 2022 09:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరిగి 61,273 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,248 వద్ద కొనసాగుతున్నాయి. జాగ్రన్‌ ప్రకాశన్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎంఎస్‌టీఎస్‌, ట్రైడెంట్‌ లిమిటెడ్‌, సీక్వెంట్‌ సెక్యూరిటీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, సుజ్లాన్‌ ఎనర్జీ, షీలా ఫామ్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, కామిన్‌ ఫిన్‌  సర్వీస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

సెన్సెక్స్‌లో లోహరంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా.. రియాల్టీ రంగం అత్యధిక నష్టాల్లో ఉంది. అమెరికాలోకి నాస్‌డాక్‌, డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు స్వల్పలాభాల్లో ట్రేడింగ్‌ ముగించాయి. అమెరికాలో 40ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ద్రవ్యోల్బణం 7శాతం పెరిగింది. దీంతో ఫెడ్‌ వేగంగా వడ్డీ రేట్లు వేగంగా పెంచాల్సిన అవసరం లేని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని