stock market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌ 238 పాయింట్లు పెరిగి 57,923 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 17,234 వద్ద ట్రేడవుతున్నాయి. ఒక్క బ్యాంకెక్స్‌ సూచీ మినహా మిగిలిన సూచీలన్నీ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అత్యధికంగా టెలికం సూచీ 0.70శాతం లాభపడింది. 

జేఎంసీ ప్రాజెక్ట్స్‌, అపోలో పైప్స్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా షేర్ల విలువ పెరగ్గా.. అవురమ్‌ ప్రాప్‌టెక్‌, ట్రైడెంట్‌,జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, త్రివేణీ టర్బైన్‌ షేర్ల విలువ కుంగింది. అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో వాల్‌స్ట్రీట్‌ సూచీలు భారీగా  కుంగాయి. డోజోన్స్‌ 1.34శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.18శాతం, నాస్‌డాక్‌ 1.83 శాతం పతనమయ్యాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని