stock market: భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు..!

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.19 గంటల సమయంలో  నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 17,662 వద్ద, సెన్సెక్స్‌ 360 పాయింట్ల 59,287 వద్ద ట్రేడవుతున్నాయి

Updated : 23 Sep 2021 09:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.19 గంటల సమయంలో  నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 17,662 వద్ద, సెన్సెక్స్‌ 360 పాయింట్ల లాభంతో 59,287 వద్ద ట్రేడవుతున్నాయి. రేమాండ్స్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ గ్రానిటో ఇండియా, పీటీసీ ఇండియా, వొడాఫోన్‌ ఐడియా, కల్పతరూ పవర్‌ షేర్ల విలువ పెరగ్గా.. ఐయాన్‌ ఎక్స్‌ఛేంజి, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, ఐనాక్స్‌, ఎస్బా ఇండియా, కజారియా సిరామిక్స్‌ షేర్ల విలువ కుంగింది. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడవుతుండటం గమనార్హం. 

నేడు హాంకాంగ్‌ మార్కెట్లలో హాంగ్‌సెంగ్‌ సూచీ 1.6శాతం లాభపడింది. ఆస్ట్రేలియా మార్కెట్‌ సూచీలు, చైనా షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ లాభాల్లో ఉండగా.. దక్షిణ కొరియా కేవోఎస్‌పీఐ, జపాన్‌ నిక్కీ నష్టాల్లో ఉన్నాయి.  మరోపక్క అమెరికా మార్కెట్లలో డోజోన్స్‌, నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు లాభాల్లో ముగిశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని