stock market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..!

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 17,924 వద్ద,  సెన్సెక్స్‌ 288 పాయింట్లు

Published : 11 Nov 2021 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 17,924 వద్ద,  సెన్సెక్స్‌ 288 పాయింట్లు పతనమై 60,064 వద్ద ట్రేడవుతున్నాయి. కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, మెటల్‌ సూచీలు అత్యధిక లాభాల్లో ఉండగా.. బ్యాంక్‌, ఫినాన్స్‌ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.  

నారాయణ హృదయాలయా, థెర్మాక్స్‌, వీమార్ట్‌ రీటైల్‌, టిమ్‌కెన్‌ ఇండియా, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్ల విలువ పెరిగింది. ఇక జమ్న ఆటో, గెలాక్సీ సర్ఫాక్టా, నెల్కో, బిర్లా కార్పొరేషన్‌, ధంపూర్‌షుగర్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు త్రైమాసిక ఫలితాలు వెల్లడించే కంపెనీల్లో ఆప్టెక్‌, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, సీఈఎస్‌ఈ, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, ఇంజినీర్స్‌ ఇండియా, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌లు కూడా ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని