భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభం

దేశీయ స్టాక్‌  మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు

Updated : 29 Apr 2021 09:48 IST

ముంబయి: దేశీయ స్టాక్‌  మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 15,036 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు నిన్నటి లాభాల జోరును కొనసాగిస్తుండటం విశేషం. చెన్నై పెట్రో,ఎస్‌ఐఎస్‌ లిమిటెడ్‌,మోరిపెన్‌ ల్యాబ్స్‌,ఉజ్వాన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌,మంగళూరు రీఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీగా విలువ పెంచుకోగా.. పనాక బయోటెక్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌,బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌,బీఎఫ్‌ యుటిలిటీస్‌,జైన్‌ ఇరిగేషన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోపక్క అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా.. ఈ రోజు ఉదయానికి ఆ దేశంలో ఫ్యూచర్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటం మన సూచీలకు బలాన్నిచ్చింది. గురువారం బైడెన్‌ 1.8ట్రిలియన్ డాలర్ల సోషల్‌ సపోర్ట్‌ ప్లాన్‌ను ప్రకటించడం దీనికి కారణంగా భావిస్తున్నారు. 
నేడు హెచ్‌యూఎల్‌, టైటన్‌, బజాజ్‌ ఆటో, టాటా కాఫీ, అంబుజా సిమెంట్స్‌, లారస్‌ ల్యాబ్స్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, ఎక్సైడ్‌, సిగ్నిటీ టెక్నాలజీస్‌, ఐనాక్స్‌ లీజర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు బోర్డు సమావేశాలు నిర్వహించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు