stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..!

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.24 సమయంలో సెన్సెక్స్‌ 269 పాయింట్లు పెరిగి 57,199,  నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 17,034 వద్ద ట్రేడవుతోంది. ఓరియంటల్‌ కార్బన్‌

Updated : 23 Dec 2021 09:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.24 సమయంలో సెన్సెక్స్‌ 269 పాయింట్లు పెరిగి 57,199,  నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 17,034 వద్ద ట్రేడవుతున్నాయి. ఓరియంటల్‌ కార్బన్‌, గ్రేట్‌ ఎస్టీమ్‌, అవ్‌రమ్‌ ప్రాపర్టీస్‌, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌, ప్రిజమ్‌ జాన్సన్‌ లాభాల్లో ఉండగా.. కాప్రిన్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌, అపోలో పైప్స్‌, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, ఆటోమోటీవ్‌ యాక్సిల్స్‌, హూస్టన్‌ ఆగ్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

బీఎస్‌ఈలో కీలక రంగాల మార్కెట్‌ సూచీలు మొత్తం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అత్యధికంగా ఇన్ఫ్రా సూచీ 0.96శాతం పెరిగింది. అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఒక శాతం పెరగ్గా.. నాస్‌డాక్‌ 1.2శాతం పెరిగింది. ఉదయం ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని