భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్‌ 363 పాయింట్లు పెరిగి

Published : 08 Apr 2021 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.34 సమయంలో సెన్సెక్స్‌ 363 పాయింట్లు పెరిగి 50,025 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 14,928 వద్ద ట్రేడవుతున్నాయి. గ్రాఫైట్‌ ఇండియా, జేపీ అసోసియేట్స్‌, హెచ్‌ఈజీ, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, హింద్‌కాపర్‌, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ రీటైల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

 ఇక రంగాల వారీగా అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్‌ మార్కెట్లో రూ.425 పెరిగి రూ.46,344గా ఉండగా.. కేజీ వెండి ధర రూ.763 పెరిగి రూ.66,660గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8పైసలు తగ్గి రూ.73.33గా నిలిచింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని