భారీగా పెరిగిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీగా పెరిగాయి. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్‌ 438 పాయింట్లు పెరిగి 50,240 వద్ద, నిఫ్టీ 139 పాయింట్లు పెరిగి 14,861 వద్ద ట్రేడవుతున్నాయి. జీఎఫ్‌ఎల్‌ఎల్‌,

Updated : 18 Mar 2021 09:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీగా పెరిగాయి. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్‌ 438 పాయింట్లు పెరిగి 50,240 వద్ద, నిఫ్టీ 139 పాయింట్లు పెరిగి 14,861 వద్ద ట్రేడవుతున్నాయి. జీఎఫ్‌ఎల్‌ఎల్‌, డైయాక్సిన్‌ టెక్నాలజీస్‌, ఎంఎస్‌టీసీ, బీహెచ్‌ఈఎల్‌ షేర్లు లాభపడగా.. ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జిందాల్‌ పాలీ, మెజెస్కో, శాటిన్‌ క్రెడిట్‌కేర్‌, ఎడల్వైజ్‌ ఫిన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టీలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే  కొనసాగుతున్నాయి. 

అమెరికా ఆర్థిక వ్యస్థలో భారీ వృద్ధి నమోదు కానుందని ఆ దేశ ఫెడరల్‌ రిజర్వు ప్రకటించడం మార్కెట్లలో జోష్‌ నింపింది. ఇక న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ చెందిన రూ.10.8వేల కోట్ల ప్రాజెక్టు దక్కడంతో బీహెచ్‌ఈఎల్‌ షేర దాదాపు 7శాతం పెరిగింది. 

ఇవీ చదవండి

విక్రయానికి 13 విమానాశ్రయాలు!

అమెరికా చమురే ఎందుకు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని