వాహన బీమా కొనుగోలుకు ముందు పరిగణించాల్సిన 7 విషయాలు

ఒక సమగ్ర బీమా పాలసీ ప్రమాదానికి గురైన కారు లేదా బైక్ కవరేజ్ తో పాటు థర్డ్ పార్టీ ప్రయోజనాను కూడా అందిస్తుంది

Published : 22 Dec 2020 12:52 IST

కారు లేదా బైక్ బీమా పునరుద్ధరణ ముఖ్యమైన నిర్ణయం కాదని ఎక్కువ మంది భావిస్తుంటారు. అలాగే వాహన బీమా పాలసీ కొనుగోలు లేదా పునరుద్ధరించేటప్పుడు కూడా ముందు జాగ్రత్త వహించరు. కానీ జీవనశైలి లేదా అవసరాలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. అలాగే వాహన బీమా పునరుద్ధరణకు, పునఃపరిశీలించేందుకు అనేక కారణాలు ఉండవచ్చు.

బీమా పాలసీని కొనడానికి లేదా పునరుద్ధరించే ముందు కింద తెలిపిన వాటిని తప్పక చూడండి:

భారతదేశంలో రెండు రకాల వాహన బీమాలు ఉన్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బాధ్యత బీమా, రెండవది సమగ్రమైన బీమా. మన దేశంలో బీమా పాలసీని కొనుగోలు చేయడమనేది చట్ట ప్రకారం తప్పనిసరి. అయితే, ఈ బీమా ద్వారా కారు, బైక్ యజమానులకు అందించే కవరేజ్ సరిపోతుంది, ఎందుకంటే ఇతర వ్యక్తులకు లేదా వారి ఆస్తికి నష్టం కలిగించినప్పుడు మాత్రమే ఇది కవర్ చేస్తుంది. మరొక వైపు, ఒక సమగ్ర బీమా పాలసీ ప్రమాదానికి గురైన కారు లేదా బైక్ కవరేజ్ తో పాటు థర్డ్ పార్టీ ప్రయోజనాను కూడా అందిస్తుంది.

మీరు వాహనాన్ని ఎలా నడుపుతున్నారో గమనించండి. మీ డ్రైవింగ్ అలవాట్లు వాహన బీమా పాలసీ ధరను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఒకవేళ మీరు వాహనాన్ని వేగంగా నడిపేవారైతే, మీ క్లెయిమ్ చరిత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అధిక బీమా ప్రీమియంను చెల్లించాల్సి వస్తుంది. అదే మీరు నెమ్మదిగా వాహనాన్ని నడిపేవారైతే, క్లెయిమ్ను తరచుగా దాఖలు చేయకపోవచ్చు. పర్యవసానంగా,బీమా కొనుగోలు ఖర్చు తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ). ఒకవేళ మీరు మునుపటి సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, ప్రస్తుతం మీరు తీసుకునే వాహన బీమా పై ఎన్సీబీ తగ్గింపును అందిస్తుంది. ఎన్సీబీ బీమా ధరను సుమారు 50 శాతం వరకు తగ్గించగలదు. అయినప్పటికీ, క్లెయిమ్ ను దాఖలు చేసిన వెంటనే, ఎన్సీబీ నేరుగా సున్నాకు పడిపోతుంది.

మీకు కావలసినదాన్ని కొనండి:

కారు లేదా బైక్ బీమా పాలసీని కొనుగోలు లేదా పునరుద్ధరించే ముందు మీ అవసరాలకు అనుగుణంగా పాలసీ ఉందొ లేదో అంచనా వేసుకోండి. మీ కోసం కొన్ని ప్రశ్నలను కింద పొందుపరచాము, ఇవి మీకు పాలసీని పరిమితం చేయడంలో సహాయపడతాయి.

  • నేను సగటున ఎంత దూరం వాహనాన్ని నడుపుతాను?

  • నేను తరచుగా సహ-ప్రయాణీకులతో ప్రయాణిస్తున్నానా?

  • నేను నా వాహనానికి ఇటీవల కొత్త ఉపకరణాలను జోడించానా?

  • ప్రకృతి విపత్తులకు నా నివాస ప్రదేశం దగ్గరగా ఉందా?

  • వాహనాన్ని నడిపే సమయంలో నేను తరచుగా ఖరీదైన వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్తున్నానా?

మీకు మీరుగా ఇలాంటి ప్రశ్నలను అడగడం ద్వారా మీ కారు లేదా బైక్ బీమా సరైనదో కాదో కనుగొనవచ్చు.

అదనపు కవరేజ్ కోసం యాడ్-ఆన్లను తీసుకోండి:

కారు లేదా బైక్ బీమా పాలసీకి మీకు నచ్చిన అదనపు కవరేజ్ యాడ్-ఆన్లను ఎంపిక చేసుకోవచ్చు. బీమా సంస్థలు నిర్దిష్ట కవరేజ్ ను అందిస్తున్నందున, ఈ అదనపు కవరేజ్ ఆప్షన్లను కొనుగోలు చేయడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అవసరం లేని యాడ్-ఆన్ ను కొనుగోలు చేసినట్లైయితే, మీ కారు లేదా బైక్ బీమా కోసం అదనపు డబ్బును వెచ్చించినవారవుతారు. జనాదరణ పొందిన యాడ్-ఆన్ల లో కొన్నిటిని మీకోసం కింద తెలియచేస్తున్నాము.

  • జీరో డిప్రిసియేషన్ లేదా బంపర్ టూ బంపర్ యాడ్-ఆన్

  • ఉపకరణాల కవరేజ్

  • ఇంజిన్ రక్షణ యాడ్-ఆన్

  • రోడ్ సైడ్ సహాయం యాడ్-ఆన్

  • కీ ప్రొటెక్షన్ యాడ్-ఆన్

  • నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ కవరేజ్

  • వినియోగ సామాగ్రి కవరేజ్

తగ్గింపులను మర్చిపోవద్దు:

క్లెయిమ్ మొత్తంలో మీ బాధ్యతగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తగ్గింపులు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది స్వచ్ఛంద తగ్గింపు, రెండవది కచ్చితమైన తగ్గింపు. మీరు స్వచ్ఛంద డిడక్టబుల్ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకోవచ్చు. డిడక్టబుల్స్ అనేవి బీమా మొత్తాన్ని తగ్గిస్తాయి. అయితే, తక్కువ క్లెయిమ్ మొత్తాన్ని దాఖలు చేయడం వలన మీ బీమా సంస్థకు అధిక స్వచ్ఛంద మినహాయింపు లభిస్తుంది. కంపల్సరీ డిడక్టబుల్స్ ను దావా సమయంలో తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తం మీ కారు లేదా బైక్ ఇంజన్ క్యూబిక్ సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది.

ధరను పట్టించుకోకండి:

మీరు బీమా పాలసీ ప్రీమియం కంటే తగినంత కవరేజ్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా క్లెయిమ్ సమయంలో అత్యంత ప్రయాజనాన్ని పొందుతారు. సరైన కారు లేదా బైకు బీమా పాలసీ తగినంత కవరేజ్ తో పాటు సరసమైన ప్రీమియంతో లభిస్తుంది. ప్రస్తుత రోజుల్లో, వివిధ సంస్థలకు చెందిన బీమా పాలసీలను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకునే అనేక సాధనాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. మీ కారు బీమా ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలని సర్దుబాటు చేసి, మీ అవసరాలకు, బడ్జెట్ కి సరిగ్గా సరిపోయే పాలసీని కొనుగోలు చేయడానికి ఈ సాధనాలను ఉపయోగించవచ్చు.

బీమా సంస్థ గురించి అవగాహన కలిగి ఉండండి:

వాహన బీమా పాలసీని కొనుగోలు చేయడం ఒక్కటే ప్రధానమైన విషయం కాదు. ఎలాంటి బీమా సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్నామనే విషయం కూడా ప్రధానమైనది. బీమా పాలసీ అనేది ఒక పత్రం, ఇది బీమా చేసిన కారు లేదా బైక్ కు ఏదైనా ప్రమాదం సంభవించిన సమయంలో ఆర్థికపరమైన సహకారాన్ని అందిస్తుంది. పాలసీ కొనుగోలు చేసే ముందు బీమా సంస్థ ప్రొఫైల్ ను పరిశీలించడం మాత్రం మర్చిపోకండి. సంస్థ అందించే సేవలు, ధర, వినియోగదారుల సమీక్షలు, క్లెయిమ్స్ చరిత్ర మొదలైన ముఖ్యమైన విషయాలను పరిగణించవలసిన ఉంటుంది.

ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువ అయింది. పాత రోజుల్లో ప్రజలకు ఇవి అందుబాటులో లేవు. అప్పుడు వారు పాలసీని కొనుగోలు చేయడానికి బీమా ఏజెంట్ మీద ఆధారపడేవారు. కొన్ని సమయాల్లో వారు పాలసీ దారులను మోసం చేసి ఎక్కువ ప్రీమియంకు తక్కువ కవరేజ్ లభించే బీమా పాలసీలను అందించేవారు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి సరసమైన ధరకు ఎక్కువ కవరేజ్ లభించే పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని