Updated : 27 Jul 2021 19:02 IST

Share chat: రూ.1,080 కోట్లు సమీకరించిన షేర్‌చాట్‌ 

ముంబయి: దేశీయ కంటెంట్‌ షేరింగ్‌ యాప్‌ ‘షేర్‌ చాట్‌’ భారీ స్థాయిలో పెట్టబడులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌, మూరే స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ సహా మరో సంస్థ నుంచి మొత్తం రూ.1,080 కోట్లు సేకరించింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ మూడు బిలియన్ డాలర్లకు చేరింది. నాలుగు నెలల క్రితం టైగర్‌ గ్లోబల్‌ స్నాప్‌, ట్విటర్‌ సహా మరికొన్ని కంపెనీల నుంచి షేర్‌ చాట్‌ 502 మిలియన్ డాలర్లు సమీకరించింది. యాప్‌లో ఉపయోగిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు తాజా పెట్టుబడులను వినియోగిస్తామని సంస్థ తెలిపింది. తద్వారా మరింత ఫ్రెండ్లీ ఎడిటింగ్‌ టూల్స్‌ను యూజర్లకు చేరువ చేస్తామని ప్రకటించింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత దేశీయ యాప్‌లైన షేర్‌ చాట్‌, మోజ్‌లకు ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. షేర్‌చాట్‌కు 18 కోట్లు, మోజ్‌కు 16 కోట్ల యూజర్లు ఉన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని