ఎఫ్డీ సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌కు తరలించడం ఎలా?
ఈ మధ్య కాలంలో ఆర్థిక సలహాదార్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువల్ ఫండ్లకు మళ్లించుకోమంటున్నారు. ఈ ప్రక్రియను ఎలా లాభదాయకమో చూద్దాం..
ఈ మధ్య కాలంలో ఆర్థిక సలహాదార్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువల్ ఫండ్లకు మళ్లించుకోమంటున్నారు. ఈ ప్రక్రియను ఎలా లాభదాయకమో చూద్దాం..
మళ్లించడమెలా
పెట్టుబడిదారులు శాతాల్లో తగ్గుదల కంటే వాస్తవ రాబడులను పరిగణనలోనికి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది ఆర్థిక సలహాదార్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నడబ్బును మ్యూచువల్ ఫండ్లలోకి మళ్లించండి అని చెబుతుంటారు. ఇందుకు మంచి కారణాలు ఉన్నాయి. అయితే అలా చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెట్టుబడి కాలవ్యవధి
ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి డబ్బును మ్యూచువల్ ఫండ్లకు మళ్లించదల్చుకుంటే తొలుత డెట్ ఫండ్లను ఎంచుకోండి. తొలి రోజుల్లో ఈక్విటీ, బ్యాలెన్స్డ్ ఫండ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. డెట్ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు ఎంతకాలం పాటు పెట్టుబడి కొనసాగించాలో అవగాహన ఏర్పర్చుకోండి. డెట్ ఫండ్స్‌లో రాబడి తక్కువగా ఉన్నా దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
పన్ను విధానం
డెట్ ఫండ్లతో పెట్టుబడి ప్రారంభించడం మంచిదే. అయితే వాటిపై వర్తించే పన్నుల గురించి కూడా తెలుసుకోవాలి. మూడేళ్ల లోపు డెట్ ఫండ్ల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటే స్వల్పకాల మూలధన లాభం కింద ఆయా వ్యక్తుల ట్యాక్స్ శ్లాబ్‌లను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 10.3%, 20.6%, 30.9% ఇలా అన్నమాట. మూడేళ్ల తర్వాత డెట్ ఫండ్లలోంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటే ఇండెక్సేషన్‌తో కలిపి 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే డెట్ మ్యూచువల్ ఫండ్లలో మరింతగా పన్ను ఆదా చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
క్రమమైన ఆదాయానికి
ఎఫ్‌డీల నుంచి వడ్డీ రూపంలో కొంత సొమ్మును నెల నెలా అందుకోవచ్చు. ఈ వెసులుబాటు డెట్ మ్యూచువల్ ఫండ్ల ద్వారా పొందవచ్చు. ఇందుకోసం సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా ఫండ్ యూనిట్లను మినహాయించుకొని నెలా నెలా కొంత సొమ్ము బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది. ఇది మనమిచ్చిన మ్యాండేట్ ప్రకారం జరిగిపోతుంది. నెలకు ఎంత సొమ్ము కావాలో మ్యాండేట్ ఇవ్వడం ద్వారా ఆ మొత్తానికి యూనిట్లను మినహాయించుకొని బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది.
డెట్ ఫండ్ల ఎంపిక
ఎఫ్డీలకు మంచి ప్రత్యామ్నాయం స్వల్ప కాల డెట్ ఫండ్లు. డెట్ ఫండ్లలో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్లు లాంటి రకాలుంటాయి. ఒకటి లేదా రెండు నెలల కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారు లిక్విడ్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఏడాదిపాటు పెట్టుబడి కొనసాగించాలనుకునేవారు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లను ఎంపిక చేసుకోవడం మేలు. అదే ఏడాదికంటే ఎక్కవ కాలంపాటు చేయాలంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ ఎంపిక మేలని నిపుణుల సూచన. పెట్టుబడులపై కొంచెం రిస్క్ తీసుకొని ఎక్కువ రాబడి ఆశించేవారు ఈక్విటీల్లో దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్