మీకు ఏ ప‌న్ను విధానం పనిచేస్తుందో తెలుసుకోండి

మీ సంస్థ ప్రతి నెలా మీ ఆదాయం నుంచి మూలం వద్ద పన్ను (TDS) ను విధిస్తుంది  

Updated : 01 Jan 2021 20:01 IST

ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకున్నట్లయితే , డిక్లరేషన్ ఫారం ద్వారా మీ సంస్థకు తెలియచేయాలి. మీ సంస్థ ప్రతి నెలా మీ ఆదాయం నుంచి మూలం వద్ద పన్ను (TDS) ను విధిస్తుంది.

మీకు ఏ విధానం పనిచేస్తుందో తెలుసుకోండి:
ఈ నెల 13 న ఆదాయపు పన్ను శాఖ వారు సర్కులర్ ప్రకారం , సంస్థలు తమ ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ పొందాలి.ఉద్యోగులు పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తారా లేదా కొత్త పన్ను విధానంలోకి మారుతున్నారో తెలియచేయాలి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని కూడా అమలుచేసారు. కొత్త పన్ను విధానం ఎన్నుకున్నట్లయితే ఉద్యోగికి ఎటువంటి తగ్గింపులు, మినహాయింపులు లేకుండా తక్కువ పన్ను రేటు చెల్లించవచ్చు.

కొత్త పన్ను విధానం కోసం డిక్లరేషన్ ఇచ్చినట్లయితే, మొత్తం ఆర్ధిక సంవత్సరం 2020-21 కి , దీని ప్రకారం మూలం వద్ద పన్ను లెక్కించి , పన్ను తగ్గిస్తారు . ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వనట్లయితే , పాత పన్ను విధానం ప్రకారం పన్ను లెక్కిస్తారు.

ఒకసారి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ఆర్ధిక సంవత్సరం మధ్యలో మార్చుకునే వీలుండదు. అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఉద్యోగి తనకు వీలున్న విధానాన్ని ఎంచుకుని రిటర్న్ దాఖలు చేయొచ్చు. అయితే కొన్ని మినహాయింపులు సంస్థ ద్వారానే క్లెయిమ్ చేయొచ్చు. అందువలన రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ మినహాయింపులు పొందలేకపోవచ్చు. అధిక పన్ను చెల్లించినట్లయితే , రిటర్న్ దాఖలు చేసి , తిరిగి పొందొచ్చు .

కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లతో వివిధ స్లాబ్స్ ఉన్నప్పటికీ , చాలా వరకు మినహాయింపులు వుండవు . ప్రతి ఒక్కరు తమ ఆదాయాన్ని , తగ్గింపులను, మినహాయింపులను పరిగణించి , ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఏడాదిలో అన్ని మినహాయింపులను ( రూ 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) రూ 2.50 లక్షలు దాటితే , కొత్త విధానం వల్ల ప్రయోజనం వుండదు .

అద్దె ఇంట్లో వుంటూ , హెచ్ ఆర్ ఏ క్లెయిమ్ చేస్తున్నా, గృహరుణం తీసుకుని వడ్డీ ని మినహాయింపు పొందుతున్నా , రూ 2 లక్షల పరిధిని దాటొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సి కింద పూర్తి మినహాయింపులు ఉన్నా , పాత పన్ను విధానమే మంచిది .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని