Shriram Properties IPO: ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పెట్టుబడి పెడతారా?

నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌  10న ముగియనుంది...

Published : 08 Dec 2021 11:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌  10న ముగియనుంది. మొత్తం రూ. 600 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించే షేర్ల పరిమాణాన్ని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ రూ. 550 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు కంపెనీ తగ్గించింది. దీంతో ఐపీవో పరిమాణం కూడా రూ. 800 కోట్ల నుంచి రూ. 600 కోట్లకు తగ్గింది. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ.250 కోట్లు విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో రూ.350 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. పబ్లిక్‌ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం రిజర్వు చేశారు. సిబ్బందికి గరిష్ఠ ధరతో పోలిస్తే 11 శాతం రాయితీకి షేర్లు లభిస్తాయి. కొత్తగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాల కోసం శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ వినియోగించనుంది. 

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 08, 2021

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: డిసెంబరు 10, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: డిసెంబరు 15, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 16, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: డిసెంబరు 17, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: డిసెంబరు 20, 2021

ముఖ విలువ: రూ.10 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 125 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 125 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 1625 (13 లాట్లు)

ఐపీఓ ధర శ్రేణి: ₹113 - ₹18 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

నిధుల సమీకరణ అంచనా: రూ.600 కోట్లు

నిధుల వినియోగం: రుణాల చెల్లింపుతో పాటు కార్పొరేట్‌ అవసరాలు

సంస్థ వివరాలు..

శ్రీరామ్‌ గ్రూప్‌లో భాగమైన ఈ సంస్థను 2000లో ప్రారంభించారు. ఈ కంపెనీ ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో మిడ్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. అందుబాటు ధరలో ఇళ్లను అందించడం వీరి ప్రధాన లక్ష్యం. మిడ్‌ మార్కెట్‌ ప్రీమియం, విలాసవంతమైన ఇళ్లు, వాణిజ్య, కార్పొరేట్‌ రంగంలో కూడా ఇది కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, విశాఖపట్నం, కోల్‌కతా ఈ సంస్థకు కీలక మార్కెట్లుగా ఉన్నాయి. దక్షిణాదిలో అగ్రగామి రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఇదొకటి. సెప్టెంబరు 30, 2021 నాటికి 29 ప్రాజెక్టులను పూర్తి చేసింది. మొత్తం 16.76 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌ ఏరియాను విక్రయించింది.

ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)..

సంవత్సరం    2018     2019     2020

ఆదాయం      420      724      632

ఆస్తులు       3,285     3,371    3,404

లాభాలు       343       49      -86

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని