కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉపయోగపడే డిజిటల్ చెల్లింపులు
కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకునే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా డిజిటల్ చెల్లింపుల వినియోగంపెరిగింది.....
కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకునే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా డిజిటల్ చెల్లింపుల వినియోగంపెరిగింది.
కరోనావైరస్ సుదూర వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మార్కెట్లకు అతిపెద్ద ముప్పుగా మారింది. వైరస్ వ్యాప్తి ప్రభావాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.
కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలకు భరోసా ఇచ్చి డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలను ఉపయోగించాలని ఆర్బీఐ కూడా వినియోగదారులను కోరింది.
కోవిడ్-19 వ్యాప్తికి ప్రత్యక్షంగా దెబ్బతిన్న విమానయాన సంస్థలు, ప్రయాణ, రిటైల్, థియేటర్లు, రెస్టారెంట్లు, వినోద ఉద్యానవనాలు వంటి కొన్ని రంగాలు డిజిటల్ చెల్లింపుల వాడకాన్ని తగ్గించాయి, ఇప్పుడు కిరాణా దుకాణాలు, ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, ఇ-లెర్నింగ్, ఏటీఎం ఉపసంహరణలు, బ్రాడ్‌బ్యాండ్ వినియోగం డిజిటల్ చెల్లింపుల వాడకానికి ప్రోత్సహిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంచుకోవాల్సిన డిజిటల్ చెల్లింపు పద్ధతులు
-
క్యూఆర్ కోడ్
క్విక్ రెస్పాన్స్ కోడ్ (క్యూఆర్ కోడ్) ఆధారిత చెల్లింపులు ఆధునిక చెల్లింపు యాప్‌లు, పరికరాల్లో ప్రజాదరణ పొందుతున్నాయి. ఇంధనం, కిరాణా, నిత్యావసర బిల్లులు, ఇంధనం, ఆహారం, ప్రయాణం, అనేక ఇతర సేవలకు చెల్లించడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్లను కాగితం లేదా స్క్రీన్ నుంచి స్కాన్ చేయవచ్చు. తక్షణ చెల్లింపులతో పాటు , భద్రతను కలిగిఉంటుంది. ఒక వినియోగదారుడు క్యూఆర్ ద్వారా చెల్లించమని అభ్యర్థించినప్పుడు, వ్యాపారి టెర్మినల్‌లోని “క్యూఆర్ కోడ్” చెల్లింపు ఎంపికను ఎంచుకుని బిల్లు మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఇది ఫోన్ స్క్రీన్‌పై డైనమిక్ క్యూఆర్ కోడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది వినియోగదారుడు ఉపయోగిస్తున్న మొబైల్-ఆధారిత క్యూఆర్ యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చు. ఒక వ్యాపారి ఫోన్ టెర్మినల్‌లో పెట్టుబడి పెట్టలేకపోతే, అతడు / ఆమె మొబైల్ ఆధారిత క్యూఆర్ యాప్‌ను ఉపయోగించి స్టాటిక్ / డైనమిక్ క్యూఆర్‌లను ఉత్పత్తి చేయవచ్చు. క్యూఆర్ లావాదేవీ లోపాలను తగ్గిస్తుంది, లావాదేవీకి సంబంధించిన ఏదైనా డేటాను ఎంటర్ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. -
యూపీఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీ ) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ) ఒక తక్షణ చెల్లింపు వ్యవస్థ. ఒక కస్టమర్ యూపీఐ చెల్లింపు మోడ్‌ను అభ్యర్థించినప్పుడు, వ్యాపారి తన పీఓస్ టెర్మినల్‌లోని “యుపిఐ చెల్లింపు” ఎంపికను ఎంచుకుని బిల్లు మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఇది పీఓఎస్ స్క్రీన్‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇప్పుడు వినియోగదారుడు ఉపయోగించే ఏ మొబైల్ ఆధారిత యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చు. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య పెరుగుతూనే ఉంది, 2019 డిసెంబర్లో 1.3 బిలియన్ లావాదేవీలను తాకింది.
3.పేమెంట్ గేట్‌వే
చెల్లింపు గేట్‌వే, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అందించే వ్యాపారి సేవ, క్రెడిట్ కార్డ్ నంబర్లు వంటి వర్చువల్ టెర్మినల్‌లోకి లేదా ఇ-కామర్స్ వెబ్సైట్లోకి ప్రవేశించిన సున్నితమైన సమాచారం వివిధ ఛానెల్‌ల ద్వారా సురక్షితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. సామాజిక దూరాన్ని కొనసాగించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుండటంతో కోవిడ్ -19 వ్యాప్తి మధ్య, ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఆర్డర్లు, కిరాణా, వినోదం మరియు ఆహారం కోసం యాప్‌లు పెరిగాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అటువంటి సేవలను పొందే వ్యక్తి చెల్లింపు గేట్‌వే ద్వారా చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు.
- కాంటాక్ట్‌లెస్ పేమెంట్
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) ఫీచర్, పీఓఎస్ టర్మినల్ సులభంగా చెల్లింపులు చేసేందుకు చిన్న దుకాణాల్లో కొనుగోలుకు ఉపయోగపడుతుంది. కస్టమర్ వారి కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ / డెబిట్ కార్డుల ద్వారా లేదా పీఓఎస్ టర్మినల్లో వారి స్మార్ట్‌ఫోన్ ద్వారా మొబైల్ అప్లికేషన్లో ట్యాప్ & పే ఫీచర్ ద్వారా చెల్లించడానికి ఎంచుకోవచ్చు. - ఎస్ఎంఎస్ ఆధారిత చెల్లింపులు
వివిధ పీఓఎస్ చుట్టూ తిరిగే కార్యాచరణతో వివిధ రకాల మొబైల్ చెల్లింపులు ఉన్నాయి. వ్యాపారి పంపిన ఎస్ఎంఎస్ లింక్ ద్వారా కస్టమర్ ఉత్పత్తులు లేదా సేవలకు చెల్లించేది ఎస్ఎంఎస్ చెల్లింపులు. బుకింగ్ / రిజర్వేషన్ కోసం ముందస్తు చెల్లింపులను తీసుకునే రెస్టారెంట్లు , సెలూన్ల వంటి సేవా-ఆధారిత పరిశ్రమలో ఎస్ఎంఎస్ ఆధారిత చెల్లింపుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అధునాతన స్మార్ట్ఫోన్ల ప్రవేశంతో , కొత్త చెల్లింపు పద్ధతులను ప్రవేశపెట్టడంతో, ఎస్ఎంఎస్ ఆధారిత చెల్లింపులు తక్కువ ప్రాచుర్యం పొందాయి, అయితే సేవా విభాగంలో వాడకం ఎక్కువగా ఉంది.
- ప్రీపెయిడ్ కార్డులు
క్లోజ్డ్-లూప్ ప్రీపెయిడ్ కార్డులు వాటిని జారీ చేసిన వ్యాపారి వద్ద మాత్రమే రీడీమ్ చేయవచ్చు. మరోవైపు, “సెమీ క్లోజ్డ్ లూప్ కార్డులు” లేదా “పరిమిత ఓపెన్-లూప్ కార్డులు” షాపింగ్ సెంటర్ కార్డుల మాదిరిగానే ఉంటాయి, ఇవి వివిధ వ్యాపారుల వద్ద ఉపయోగించవచ్చు. ఈ కార్డులను టాప్-అప్ / ఉపసంహరణ ప్రయోజనాల కోసం పీఓఎస్ టెర్మినల్‌లో ఉపయోగించవచ్చు.
ముగింపు
కోవిడ్ -19 కి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మీ సహకారం అందించడానికి, అన్ని భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నప్పుడు, సురక్షితమైన సులభమైన డిజిటల్ చెల్లింపు విధానాలను ఎంచుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు