స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా ఎండీ రాజీనామా

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్‌) ఎండీ పదవికి గురుప్రతాప్‌ బొపరాయ్‌ రాజీనామా చేశారు....

Published : 15 Dec 2021 12:27 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్‌) ఎండీ పదవికి గురుప్రతాప్‌ బొపరాయ్‌ రాజీనామా చేశారు. జనవరి 1, 2022 నుంచి ఆయన కంపెనీ నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్‌ ఛైర్మన్‌గా ఉన్న క్రిస్టియన్‌ కాన్‌ తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలో గురుప్రతాప్‌ వారసుణ్ని ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. సంస్థ చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో గురుప్రతాప్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. అలాగే స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సేల్స్‌ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా పేరిట విడివిడిగా ఉన్న సంస్థలను విలీన ప్రక్రియ ద్వారా ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలోనూ గురుప్రతాప్‌ నాయకత్వం సంస్థకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఆయన ఏప్రిల్‌ 2018లో సంస్థలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని