Skoda Rapid: స్కోడా ర్యాపిడ్‌ ఉత్పత్తి ముగింపు..!

భారత్‌లో స్కోడా ర్యాపిడ్‌ ఉత్పత్తిని ముగిసింది. ఈ విషయాన్ని కంపెనీ విక్రయాల విభాగం డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ పేర్కొన్నారు.

Updated : 01 Nov 2021 20:34 IST

 ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో స్కోడా ర్యాపిడ్‌ ఉత్పత్తి ముగిసింది. ఈ విషయాన్ని కంపెనీ విక్రయాల విభాగం డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ పేర్కొన్నారు. ఒక వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాక్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ఇటీవల మాట్‌ ఎడిషన్‌ పేరిట చివరి బ్యాచ్‌ స్కోడా ర్యాపిడ్‌ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదలైంది. ఇప్పటి వరకు లక్ష ర్యాపిడ్‌ కార్లను విక్రయించింది. దాని సెగ్మెంట్లో 10శాతం మార్కెట్‌ వాటాను కూడా ఈ కారు సొంతం చేసుకొంది. త్వరలో ర్యాపిడ్‌ను స్లావియా పేరిట వచ్చే కారు భర్తీ చేయనుంది.

ఇప్పటి వరకు ర్యాపిడ్‌తోపాటు స్లావియాను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయాలను కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ, వీటిపై ఉన్న సందేహాలను జాక్‌ ట్వీట్‌ తీర్చేసింది. స్కోడా ర్యాపిడ్‌ను తొలిసారి 2011లో భారత్‌ మార్కెట్లో విడుదల చేశారు. కాల క్రమంలో ఈ కారు నాలుగు రకాల ఇంజిన్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వీటిల్లో 1.6 పెట్రోల్‌, డీజిల్‌, 1.5 డీజిల్‌, తాజాగా 1.0 టీఎస్‌ఐ ఇంజిన్‌ను వినియోగదారులకు అందజేసింది. ట్రాన్స్‌మిషన్‌లో కూడా స్టాండర్డ్‌, డీసీజీ, టార్క్‌ కన్వర్టలను తీసుకొచ్చింది. ఇక స్కోడా స్లావియాను నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి దీని డెలివరీలు మొదలు కావచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని