ఫిబ్రవరిలో నెమ్మదించిన తయారీ

దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో స్పలంగా నెమ్మదించాయి. అయితే కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం పెరుగుతున్నందున, కొనుగోళ్ల కార్యకలాపాలు, ఉత్పాదకత మెరుగయ్యిందనే విషయాన్ని

Published : 02 Mar 2021 01:57 IST

 కొత్త ఆర్డర్లలో వృద్ధి

దిల్లీ: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో స్పలంగా నెమ్మదించాయి. అయితే కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం పెరుగుతున్నందున, కొనుగోళ్ల కార్యకలాపాలు, ఉత్పాదకత మెరుగయ్యిందనే విషయాన్ని సూచిస్తోందని పీఎంఐ సర్వే వెల్లడించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఫిబ్రవరిలో 57.5 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 57.7 పాయింట్లుగా ఉంది. జనవరితో పోలిస్తే వృద్ధి తగ్గినప్పటికీ.. దీర్ఘకాలిక సగటు అయిన 53.6 పాయింట్ల కంటే ఫిబ్రవరిలో ఈ సూచీ అధికంగానే ఉండటం గమనార్హం. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు. కొవిడ్‌-19 సంబంధించి ఆంక్షలు తొలగినప్పటికీ ఉద్యోగకల్పన మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని