బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వ‌డ్డీ ఇస్తున్న ప‌థ‌కాలు ఇవే..

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది.......

Published : 25 Dec 2020 17:09 IST

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది.

డిసెంబ‌రు త్రైమాసికానికి చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లను య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ నిర్ణ‌యించింది. బ్యాంకులు ఇప్ప‌టికే త‌మ వ‌డ్డీ రేట్ల‌లో కోత విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారాయి. అంతేకాదు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాల ద్వారా ఎక్కువ నిధులు స‌మ‌కూర్చుకునే వీలుంది.

ఒక సంవ‌త్స‌రం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌(ఎఫ్‌డీ)పై ప్ర‌స్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.9 శాతం వ‌డ్డీ అందిస్తుంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5.1 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో భాగ‌మైన ఒక సంత్స‌రం డిపాజిట్లతో 5.5 శాతం రాబ‌డి పొందొచ్చు.

ఐదేళ్ళ కాల‌వ్య‌వ‌‌ధితో వ‌చ్చే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ డిపాజిట్ల మ‌ధ్య కూడా వ్య‌త్యాసం ఉంది. 5 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎస్‌బీఐ 5.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు 5.5 శాతం వ‌డ్డీ అందిస్తుండ‌గా, అదే కాల ‌వ్య‌వ‌ధిగ‌ల పోస్టాఫీసు ఐదేళ్ళ డిపాజిట్లలో 6.7శాతం వ‌డ్డీ, ఐదేళ్ల జాతీయ పొదుపు ప‌త్రాల‌పై 6.8 శాతం ల‌భిస్తుంది. ఈ వ‌డ్డీ రేట్ల మధ్య ఉన్న అంత‌రం చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వైపు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఉన్న బ్యాంక్ ఎఫ్‌డీలు మెచ్యూరిటీ స‌మ‌యానికి చేరువ‌లో ఉంటే, ఫోస్టాఫీసు వ‌ద్ద కొత్త ఎఫ్‌డీ చేయ‌డం ద్వారా అధిక రాబ‌డిని పొంద‌వచ్చు. ఫోస్టాఫీసు ఎఫ్‌డీల‌కు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. బ్యాంక్ ఎఫ్‌డీల‌కు వ‌ర్తించే ప‌న్ను విధాన‌మే ఫోస్టాఫీసు ఎఫ్‌డీల‌కు వ‌ర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని