రూ.40వేల కోట్ల స్విగ్గీ..!

ఆహార సరఫరా సేవల సంస్థ స్విగ్గీ తాజాగా భారీ విలువను సొంతం చేసుకొంది. దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 5.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.40వేల కోట్లు)గా విలువ కట్టింది.

Published : 16 Apr 2021 18:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆహార సరఫరా సేవల సంస్థ స్విగ్గీ తాజాగా భారీ విలువను సొంతం చేసుకొంది. దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 5.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.40వేల కోట్లు)గా విలువ కట్టింది. తాజాగా మాస్కోషి సన్‌ విజన్‌ ఫండ్‌2  నుంచి స్విగ్గీలో 450 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులకు భారత యాంటీట్రస్ట్‌ రెగ్యూలేటరీల ఆమోదముద్ర పడాల్సి ఉందని ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొంది. దీనిపై స్విగ్గీకానీ, అటు సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కానీ స్పందించలేదు.

స్విగ్గీలో ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ ఎల్‌పి, గోల్డ్‌మన్‌ సాక్స్‌ గ్రూప్‌ ఇప్పటికే 800 మిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబుడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా భారత స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వరద పారుతోంది. దాదాపు ఆరు స్టార్టప్‌లను కనీసం బిలియన్‌ డాలర్‌ కంటే ఎక్కువగా విలువ కట్టి పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోలో యాంట్‌గ్రూప్‌ కో, టైగర్‌ గ్లోబల్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇక అమెజాన్‌ కూడా తన ఆహార సరఫరా విభాగాన్ని బలోపేతం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని