డిస్కౌంట్ ధ‌ర‌లో ప‌సిడి బాండ్లు

బాండ్ల‌ మెచ్యూరిటీ వ్యవధిని బట్టి 1 శాతం నుంచి 6 శాతం డిస్కౌంట్ ఉంటుంది....

Published : 22 Dec 2020 17:19 IST

బాండ్ల‌ మెచ్యూరిటీ వ్యవధిని బట్టి 1 శాతం నుంచి 6 శాతం డిస్కౌంట్ ఉంటుంది

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి విడ‌త ప‌సిడి బాండ్ల జారీ సోమ‌వారం ప్రారంభ‌మైంది. యూనిట్ ధ‌ర రూ.4,639 గా నిర్ణ‌యించారు. ప్రస్తుత బాండ్ల‌తో పాటు ముందు జారీ చేసిన బాండ్లు కూడా డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇష్యూ వారానికి ముందు వారంలోని చివరి మూడు పనిదినాల సగటు ధర ఆధారంగా బంగారు బాండ్ ప్రస్తుత ఇష్యూ ధర నిర్ణ‌యిస్తారు. అలాగే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి యూనిట్‌కు రూ. 50 తగ్గింపు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం బంగారు బాండ్ల యొక్క ప్రతి ఇష్యూను జారీ చేసిన పక్షం రోజులలోపు ఎక్స్‌ఛేంజ్‌ల‌లో జాబితా చేయాలి.

ఇప్ప‌టివ‌ర‌కు 37 ప‌సిడి బాండ్ల ఇష్యూలు ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లో ఏప్రిల్ 21 న ఈ బాండ్ల ట్రేడింగ్ ధర ప్రకారం, ఇవన్నీ ప్రస్తుత ఇష్యూ ధర, భౌతిక బంగారానికి తగ్గింపులో ఉన్నాయి. బాండ్ల‌ మెచ్యూరిటీ వ్యవధిని బట్టి 1 శాతం నుంచి 6 శాతం పరిధిలో డిస్కౌంట్ ఉంటుంది.

దీని అర్థం మీరు బంగారం కంటే పాత బాండ్ల‌ను డిస్కౌంట్ ధ‌ర‌తో ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోల చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ప్ర‌స్తుత బాండ్ల కంటే మునుప‌టి బాండ్లు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. అయితే, మీరు ఈ బాండ్లను సెకండరీ మార్కెట్ నుండి కొనాలని ఆలోచిస్తుంటే, ఈ బాండ్లు ప్రస్తుత బంగారం మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఎందుకు వర్తకం చేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి.

మార్కెట్‌లో బంగారం ధ‌ర‌కు ప‌సిడి బాండ్ల ధ‌ర‌కు వ్య‌త్యాసం ఎందుకు ఉంటుందంటే , విక్ర‌యందారుల‌కు అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బంగారం ధ‌ర‌తో సంబంధం లేకుండా విక్ర‌యిస్తారు . అందువల్ల, బంగారం మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు బంగారు బాండ్లను పొందడం ద్వారా కొనుగోలుదారు ప్రయోజనం పొందుతాడు, విక్రేత ద్రవ్యత పొందుతాడు. మెచ్యూరిటీకి దగ్గరగా ఉన్న బాండ్ డిస్కౌంట్ దీనికి విరుద్ధంగా ఉంటుంది. బంగారు బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియ‌డ్ ఉంటుంది.

మీరు ఈ బాండ్లను సెకండరీ మార్కెట్ నుంచి కొనాలనుకుంటే, దాని ద్రవ్యత ఎక్కువగా లేనందున మెచ్యూరిటీ వరకు కొన‌సాగిస్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మరోవైపు, ఎక్స్ఛేంజిలో విక్రయించాలనుకుంటే, ఆ సమయంలో బంగారం ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువ ధర కోసం వేచిచూడాల్సి ఉంటుంది. అలాగే, మెచ్యూరిటీ వరకు బంగారు బాండ్లను కలిగి ఉండటం వ‌ల‌న‌ మూలధన లాభాల పన్ను ఉండదు.

"బంగారంలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నవారికి, బంగారు బాండ్లు మంచి ఎంపిక, ఎందుకంటే పెట్టుబడిదారుడు మూలధన లాభంతో పాటు అదనంగా 2.5 శాతం సంపాదిస్తాడు. అయినప్పటికీ, అవగాహన లేకపోవడం వల్ల ఈ బాండ్లు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని