ప్ర‌త్యేక ఎఫ్‌డీ లేదా అధిక వ‌డ్డీ పొదుపు ఖాతా - సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు ఏది మంచిది ?

సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డి ప‌థ‌కం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే వ‌డ్డీ రేటు 6.20%గా ఉంది.

Published : 16 Jan 2021 12:56 IST

దేశీయంగా వ‌డ్డీ రేట్లు ప్ర‌స్తుత కాలంలో చాలా త‌క్కువుగా ఉన్నాయి. ఇది ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇబ్బందికర ప‌రిస్థితిని క‌లిగిస్తుంది. వీరు సాధార‌ణంగా త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ మొత్తంలో పెట్టుబ‌డిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లు వంటి స్థిర ఆదాయ సాధ‌నాల‌పై పెట్టుబ‌డిగా పెడతారు. రెన్యువల్ చేయవలసినపుడు రేట్లు పడిపోతే వారు వడ్డీ ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అటువంటి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యామ్నాయాన్ని అందించ‌డానికి, కొన్ని బ్యాంకులు ప్ర‌త్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ప్రారంభించాయి. ఇవి సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల కంటే 30-80 బేసిస్ పాయింట్ల‌ను ఎక్కువుగా అందిస్తాయి.

అయితే ఈ ఎఫ్‌డీలు అందించే వ‌డ్డీ రేట్లు 6.20% నుండి 6.30% వ‌ర‌కు ఉంటాయి. ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంకు అయితే ఏకంగా త‌న పొదుపు ఖాతా క‌స్ట‌మ‌ర్లకు  అధిక వ‌డ్డీ రేటును (7%) అందిస్తుంది. నెల‌వారీ స‌గ‌టు బ్యాలెన్స్ రూ. 25,000 మాత్ర‌మే.

పొదుపు ఖాతాల్లో ఉంచిన డ‌బ్బుకు లాక్‌-ఇన్ ఉండ‌దు, ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో ఎటువంటి జ‌రిమానా ఉండ‌దు. అందువ‌ల్ల సీనియ‌ర్ సిటిజ‌న్లు అకాల ఉప‌సంహ‌ర‌ణ‌పై లాక్‌-ఇన్/ జ‌రిమానా క‌లిగి ఉన్న ఈ ప్ర‌త్యేక ఎఫ్‌డీలలో పొదుపు చేయాలా లేదా అధిక వ‌డ్డీ రేట్ల‌ను అందించే ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పొదుపు బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బుని ఉంచాలా అని ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. అయితే డ‌బ్బును పొదుపు ఖాతాలో ఉంచిన‌పుడు, బ్యాంక్ ముంద‌స్తు నోటీస్ లేకుండా వ‌డ్డీ రేటును మార్చ‌గ‌ల‌ద‌ని గుర్తించుకోవాలి. ప్ర‌త్యేక ఎఫ్‌డీల విష‌యంలో ఎఫ్‌డీ మొత్తం కాల‌ప‌రిమితికి వ‌డ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.

ప్ర‌స్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.4% వ‌డ్డీ రేటును అందిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ ప్ర‌త్యేక ఎఫ్‌డి ప‌థ‌కం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ పెడితే వ‌డ్డీ రేటు 6.20%గా ఉంది.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్, `ఐసీఐసీఐ గోల్డెన్ ఇయ‌ర్స్` అనే  ప్ర‌త్యేక ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 6.30% వ‌డ్డీ రేటును అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కంగా `హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్` అనే ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి 6.25% వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల‌ప‌రిమితి సాధార‌ణంగా 5 సంవ‌త్స‌రాల నుండి ప్రారంభ‌మ‌వుతుంది. ప్ర‌త్యేక ఎఫ్‌డీల విష‌యంలో ఎఫ్‌డీ మొత్తం కాల‌ప‌రిమితికి వ‌డ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.

ఈ ఎఫ్‌డీల‌పై 1-1.5% వ‌ర‌కు అకాల ఉప‌సంహ‌ర‌ణ జ‌రిమానాలు ఉన్నాయి. ఈ ఎఫ్‌డీలు ఈ మార్చి 31 వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం సీనియ‌ర్ సీటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ 7.4% వ‌డ్డీని అందిస్తోంది. 5 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంది. దీనికి వ‌డ్డీ ప్ర‌తి 3 నెల‌ల‌కు స‌వ‌రించ‌బ‌డుతుంది.

5 ఏళ్ల సుదీర్ఘ కాల‌ప‌రిమితి గ‌ల ప్ర‌త్యేక ఎఫ్‌డీల‌లో త‌మ మొత్తం డ‌బ్బు‌ను లాక్ చేయ‌కూడ‌ద‌ని,  మార్కెట్లో గ‌ల‌ అన్ని పొదుపు ప‌థ‌కాల‌లో త‌మ పెట్టుబ‌డుల‌ని విస్త‌రించాల‌ని నిపుణుల అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని